KTR Birthday Song 2022 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్.. తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అయనకు కేటాయించిన పనులను చక్కబెడుతూ ప్రజా నాయకుడు అనిపించుకుంటున్నారు. కేసీఆర్ మున్ముందు జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కేటీఆర్ దే హవా సాగే అవకాశం ఉంది. దీంతో ఇప్పటి నుంచే టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కు దగ్గర కావాలని చూస్తున్నారు. ఇందులో బాగంగా ప్రత్యేక కార్యక్రమాల్లో కేటీఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ‘యుగపురుషుడు’ అంటూ ఓ వీడియో రిలీజ్ అయింది. త్వరలో ఆయన జన్మదినం ఉన్నందున ఈ వీడియో విడుదల కావడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ సృష్టిస్తోంది. టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ వీడియోను షేర్ చేస్తూ పండుగ చేసుకుంటున్నారు.

జూలై 24న కేటీఆర్ బర్త్ డే. ఈ సంద్భంగా ఆ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి ‘యుగపురుషుడు’ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో కేటీఆర్ రాజకీయ జీవితం గురించి వివరించి ఉంది. ‘యుగపురుషుడు’ అనే టైటిల్ ఇచ్చిన ఈ వీడియోలో కేటీఆర్ యువతకు ఆదర్శం అంటూ చెప్పారు. డిజిలైజేషన్ పూర్తి చేసుకున్న తరువాత దీనిని విడుదల చేశారు. అన్నిహంగులతో ఈ వీడియో యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. దీంతో ‘యుగపురుషుడు’ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది.
సాధారణంగా కేటీఆర్ బర్త్ డే కు ముందు టీఆర్ఎస్ నాయకులు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈసారి అలాంటి హడావుడి కనిపించడం లేదు. కారణాలు ఏవైనా కేటీఆర్ బర్త్ డే దగ్గరకు వచ్చినా బర్త్ డేకు రెండ్రోజుల ముందైనా కనీసం ఫ్లెక్సీలు కనిపించడం లేదు. దీంతో కొందరు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే మరికొందరు మాత్రం తెలంగాణలో నెక్ట్స్ సీఎం కేటీఆర్ అని భావిస్తున్నారు. దీంతో ఆయనను మచ్చిక చేసుకునేందుకు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపీ రంజిత్ రెడ్డి ‘యుగపురుషుడు’ వీడియోను రిలీజ్ చేశారు.
అయితే ఈ సారి సోషల్ మీడియాలోనే కేటీఆర్ బర్త్ డేను హల్ చల్ చేయనున్నారు. ప్రత్యేక పోస్టర్లు రిలీజ్ చేసి ఆకట్టుకోనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో మాన్యువల్ హడావుడి కనిపించడం లేదు. అటు తీవ్ర వర్షాభావంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో కేటీఆర్ పేరు మీద ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది.అయితే బెలూన్లు, ఫ్లెక్సీలు మాత్రం కనిపించడం లేదు. వాటికయ్యే ఖర్చుతో వరదబాధితులను ఆదుకోవాలని కొందరు చూస్తున్నారు. కానీ యూత్ కార్యకర్తలు మాత్రం కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్ చేయాలని అనుకుంటున్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే రాష్ట్రంలో కేటీఆర్ దే హవా సాగనుంది. ఇప్పటికే కేసీఆర్ ఎన్డీయేపై విమర్శలు చేస్తుండగాకేటీఆర్ రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై ఫైర్ అవుతున్నారు. ప్రతీ ఆరోపణపై కేటీఆరే ముందుగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు ప్రస్తుతం నేనే అని.. మీకు కేసీఆర్ అవసరం లేదని అన్నట్లుగా విమర్శలు చేస్తున్నారు. అటు అభివృద్ధి పథకాల్లోనూ కేటీఆర్ జోరుగా ముందున్నారు. ఇప్పటికే తన నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తయారు చేసిన ఆయన ఇతర ముఖ్య నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు.

[…] […]