https://oktelugu.com/

Rashmika Mandanna: ఫుడ్ డెలివరీ గర్ల్ గా మారిపోయిన ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక

Rashmika Mandanna: సౌత్ ఇండియా లో ఇప్పుడు మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ ఎవరు అంటూ మనకి గుర్తుకువచ్చే రెండు మూడు పేర్లలో ఒకటి రష్మిక..కన్నడ సినిమాలతో ప్రారంబమైన రష్మిక సినీ కెరీర్..తెలుగు లో చలో సినిమాతో కొనసాగింది..నాగ శౌర్య హీరో గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ అవ్వడం తో రష్మిక కి టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు రావడం ప్రారంభం అయ్యాయి..ఇప్పటి వరుకు ఈమె చేసిన టాలీవుడ్ సినిమాలలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 23, 2022 / 09:51 AM IST
    Follow us on

    Rashmika Mandanna: సౌత్ ఇండియా లో ఇప్పుడు మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ ఎవరు అంటూ మనకి గుర్తుకువచ్చే రెండు మూడు పేర్లలో ఒకటి రష్మిక..కన్నడ సినిమాలతో ప్రారంబమైన రష్మిక సినీ కెరీర్..తెలుగు లో చలో సినిమాతో కొనసాగింది..నాగ శౌర్య హీరో గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ అవ్వడం తో రష్మిక కి టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు రావడం ప్రారంభం అయ్యాయి..ఇప్పటి వరుకు ఈమె చేసిన టాలీవుడ్ సినిమాలలో ఒక ‘డియర్ కామ్రేడ్’ మరియు ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ అనే సినిమాలు మినహా మిగిలిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడం విశేషం..గోల్డెన్ లెగ్ అనే పేరు బాగా ప్రచారం అవ్వడం తో రష్మిక తో సినిమాలు చెయ్యడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు..రష్మిక తమ సినిమాలో కచ్చితంగా హిట్ అనే నమ్మకం దర్శక నిర్మాతలలో కలిగింది..ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించిన రష్మిక బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు సంపాదించుకుంటుంది.

    Rashmika Mandanna

    ఇది ఇలా ఉండగా రష్మిక కి సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో గత కొద్దీ రోజుల నుండి తెగ వైరల్ గా మారిపోయింది..వివరాల్లోకి వెళ్తే రష్మిక ‘మెక్ డొనాల్డ్స్’ ఫుడ్ డెలివరీ సంస్థ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రొమోషన్స్ లో భాగంగా అప్పట్లో మెక్ డొనాల్డ్స్ సంస్థ ‘సెలబ్రిటీ మీల్స్’ అని ఒక ప్రోగ్రాం చేసారు..ఈ ప్రోగ్రాం ద్వారా రష్మిక తో ఒక కస్టమర్ కి ఫుడ్ డెలివరీ చేయించారు..ఫుడ్ డెలివరీ సేల్స్ గర్ల్ గా, స్కూటీ మీద ఒక కస్టమర్ ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంటి డోర్ బెల్ కొట్టగానే రష్మిక ని చూసి ఒక్కసారిగా ఆ కస్టమర్స్ థ్రిల్ కి ఫీల్ అయ్యారు.

    Also Read: Bhavadeeyudu Bhagat Singh: ‘భవదీయుడు భగత్ సింగ్’ నుండి హరీష్ శంకర్ అవుట్..కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్న పవన్ కళ్యాణ్

    Rashmika Mandanna

    ఆ తర్వాత రష్మిక తో కాసేపు ముచ్చటించి ఒక సెల్ఫీ తీసుకున్నారు..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది..ఇక రష్మిక ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఈమె టాలీవుడ్ లో త్వరలోనే పుష్ప పార్ట్ 2 సెట్స్ లోకి అడుగుపెట్టబోతుంది అనే విషయం మనకి తెలుసు..ఈ సినిమాతో పాటు తెలుగు లో ఆమె ‘సీతా రామం’ అనే సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తుంది..అంతే కాకుండా తమిళం లో విజయ్ తో ‘వారిసు’, బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో ‘ఎనిమల్’ మరియు అమితాబ్ బచ్చన్ తో గుడ్ బాయ్ వంటి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ గా గడుపుతుంది రష్మిక.

    Also Read: Samantha- Koffee With Karan Show: అవకాశం వస్తే నాగ చైతన్య ని చంపేస్తాను – సమంత

    Tags