https://oktelugu.com/

Mahashivratri 2024: మహాశివరాత్రి వీరి జాతకాల్లో మార్పులు తేనుంది.. ఏ యే రాశులపై ప్రభావం ఉందో తెలుసా?

త్రిగ్రహి కలయిక వల్ల మేష రాశి జీవితాల్లో మార్పులు సాగున్నాయి. మార్చి 8 నుంచి ఈ రాశి వారికి అంతా శుభమే కలుగుతుంది. ఆ రాశి వారి ఇంట్లో ఆనందం రెట్టింపు అవుతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : March 2, 2024 / 04:36 PM IST
    Follow us on

    Mahashivratri 2024 సంవత్సరంలో మార్చి 8న మహాశివరాత్రి జరనుంది. ఈ రోజున శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రంతా జాగారణ చేస్తూ లింగేశ్వరుడిని పూజిస్తారు. అయితే ఈసారి మహాశివరాత్రి ప్రత్యేకం అంటున్నారు పండితులు. ఎందుకంటే మహాశివరాత్రి నాడు మూడు గ్రహాల కలయిక ఉండనుంది. దీంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో అనూహ్య మార్పులు ఉండనున్నాయి. ఈసారి శివరాత్రి కంటే ఒకరోజు ముందు బుధ గ్రహం మీనరాశిలో ప్రవేశించనున్నాడు. అంగారకుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. అటు కుంభ రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు. అంటే సూర్యుడు, శని, శుక్రుడు కలయిక ఉంటుంది. దీంతో కొన్ని రాశుల జీవితాల్లో అనేక మార్పుల రానున్నాయి.

    మేషరాశి: త్రిగ్రహి కలయిక వల్ల మేష రాశి జీవితాల్లో మార్పులు సాగున్నాయి. మార్చి 8 నుంచి ఈ రాశి వారికి అంతా శుభమే కలుగుతుంది. ఆ రాశి వారి ఇంట్లో ఆనందం రెట్టింపు అవుతుంది. ఏదేనీ వ్యాపారం ప్రారంభిస్తే అది సక్సెస్ అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు కెరీర్ లో రాణిస్తారు.

    వృషభ రాశివారిపై శివరాత్రి నుంచి ప్రభావం ఉండనుంది. వీరు సమాజంలో గౌరవం పొందుతారు. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. కొందరి జీవితాల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ అవుతుంది.

    తులా రాశీవారికి మహాశివరాత్రి కలిసి రానుంది. ఇప్పటి నుంచి వీరి సంపద పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది. జీవితం సంతోషంగా గడుస్తుంది.

    మకర రాశి వారిపై ఈ గ్రహాల కలయిక ప్రభావం ఉండనుంది. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. వ్యాపారులు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

    కుంభరాశి వారు సైతం వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. ఎలాంటి పెట్టుబడులు పెట్టినా అధిక ప్రయోజనాలు ఉంటాయి. గతంలో నుంచి వస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి.