https://oktelugu.com/

Manchu Vishnu: పెళ్లి రోజు భార్యకు మంచు విష్ణు భారీ సర్ప్రైజ్… ఆమె షాక్!

విరానికా రెడ్డి భర్త ఇచ్చిన ఆ బహుమతికి ఎంతగానో ఆనందం వ్యక్తం చేసింది. విరానికా - మంచు విష్ణులకు ముగ్గురు సంతానం. మొదట ట్విన్ డాటర్స్ పుట్టారు. అనంతరం ఒక అబ్బాయి జన్మించాడు.

Written By: , Updated On : March 2, 2024 / 05:46 PM IST
Manchu Vishnu
Follow us on

Manchu Vishnu: మంచు విష్ణు తన సతీమణి విరానికా రెడ్డికి సర్ప్రైజ్ ఇచ్చాడు. పెళ్లి రోజు ఆశ్చర్యంలో ముంచేశాడు. మంచు విష్ణు సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. 2011లో విరానికా రెడ్డిని మంచు విష్ణు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈమె ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బంధువు. మ్యారేజ్ యానివర్సరీ నేపథ్యంలో భార్యకు ఓ అనుభూతి పంచాడు. లక్షలు ఖర్చు చేసి ఒక హెలికాప్టర్ ఏర్పాటు చేశాడు. గగన వీధిలో అలా చక్కర్లు కొట్టించాడు.న్యూజిలాండ్ లోని అందమైన ప్రదేశాల్లో మంచు విష్ణు, విరానికా హెలికాప్టర్ లో చక్కర్లు కొట్టారు.

విరానికా రెడ్డి భర్త ఇచ్చిన ఆ బహుమతికి ఎంతగానో ఆనందం వ్యక్తం చేసింది. విరానికా – మంచు విష్ణులకు ముగ్గురు సంతానం. మొదట ట్విన్ డాటర్స్ పుట్టారు. అనంతరం ఒక అబ్బాయి జన్మించాడు. విరానికా బిజినెస్ ఉమన్. ఆమె పలు వ్యాపారాలు చేస్తున్నారు. మంచు విష్ణు సినిమాల్లో బిజీ కాగా, ఆమె వ్యాపారంలో బిజీ అన్నమాట.

మరోవైపు మంచు విష్ణు హీరోగా స్ట్రగుల్ అవుతున్నాడు. ఆయన చిత్రాలకు కనీస వసూళ్లు రావడం లేదు. విష్ణు గత చిత్రం జిన్నా పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా కోటి రూపాయల షేర్ రాబట్టలేకపోయింది. వరుస పరాజయాలతో మంచు విష్ణు మార్కెట్ దెబ్బతింది. ఈ క్రమంలో అతిపెద్ద సాహసానికి ఒడిగట్టాడు. ఏకంగా పాన్ ఇండియా మూవీ ప్రకటించాడు. కన్నప్ప టైటిల్ తో భక్తిరస చిత్రం చేస్తున్నాడు.

కన్నప్ప చిత్రాన్ని అధిక భాగం న్యూజిలాండ్ లో షూట్ చేస్తున్నారు. లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల స్టార్ట్ అయ్యింది. మంచు విష్ణు కన్నప్ప చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్నాడు. కన్నప్ప మూవీలో స్టార్ క్యాస్ట్ క్యామియో రోల్స్ చేస్తున్నారు. ప్రభాస్ శివుడిగా నటిస్తున్నాడని సమాచారం. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్ హీరోలు కన్నప్ప మూవీలో భాగం అయ్యారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.