Mahashivratri 2024: సంక్రాంతి తర్వాత వచ్చే పర్వదినాలలో మహాశివరాత్రి అత్యంత ప్రధానమైనది. హిందూ సంప్రదాయం ప్రకారం పండగలన్నీ పగటిపూట జరిగితే.. ఈ మాత్రం రాత్రి జరుగుతుంది.. మాఘ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి అర్ధరాత్రి వరకు విస్తరించి ఉంటుంది. అలా విస్తరించిన రోజును మహాశివరాత్రిగా పరిగణిస్తారని ధర్మసింధువు గ్రంథం చెబుతోంది. అలా అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి రోజు శివరాత్రి జరుపుకుంటారు..శివరాత్రి రాత్రి జరుపుకునే పండగ కాబట్టి.. ఆ పండగ రోజు అర్ధరాత్రి 12 గంటలకు మహాశివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఆ దేవుడి అనుగ్రహం కోసం రాత్రి వరకు భక్తులు మేల్కొంటారు. నిష్టగా ఉపవాసం ఉంటారు.. రాత్రి జాగరం ఉంటారు. శివుడిని స్తుతిస్తూ పాటలు పాడుతారు..శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పూజలు, భజనలు చేస్తుంటారు.
ఎలా జరుపుకోవాలంటే
శివరాత్రి నాడు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లును శుభ్రం చేసుకోవాలి. పూజ గదిని మామిడి తోరణాలతో అలంకరించాలి. ముగ్గులు వేసి తీర్చిదిద్దాలి. శివుడిని నిండు జలంతో, పంచామృతాలతో, పూజా ద్రవ్యాలతో అభిషేకించాలి. మారేడు పత్రాలు, బిల్వపత్రాలు, తుమ్మి పూలు, గోగుపూలు, పచ్చని, తెల్లని పుష్పాలతో శివుడిని అభిషేకించాలి.. శివనామ స్మరణ చేస్తూ కొలవాలి. తాంబూలం, అరటిపండు, జామ పండు, ఖర్జూర పండు స్వామి వారికి సమర్పించి శివ అష్టోత్తరాన్ని పఠించాలి. బ్రహ్మీ ముహూర్తం నుంచి ఉదయం 9 గంటల లోపు ఈ పూజా క్రతువులు పూర్తిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి..
శివరాత్రి మరుసటి రోజు
శివరాత్రి నాడు ఉపవాసం ఉండి, జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి.. స్వామివారికి నైవేద్యంగా అన్నం, కూరలు దేవుడికి నివేదన చేయాలి. దానికంటే ముందు గోమాతలకు బియ్యం, అటుకులు, తోటకూర, బెల్లం, నువ్వులు కలిపి తినిపించాలి. ఆ తర్వాత గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి. అనంతరం స్తోమతను బట్టి పేదలకు అన్నదానం చేయాలి. ఇవి చేసిన తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తే మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి..
Velishala Suresh is a Web Admin and is working with our organisation from last 3 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read More