Karthika Pournami 2021: హిందువులు అత్యంత పవిత్రంగా కార్తీక మాసాన్ని భావిస్తారనే సంగతి తెలిసిందే. హిందువులు జరుపుకునే పెద్ద పండుగలలో కార్తీక పౌర్ణమి కూడా ఒకటని చెప్పవచ్చు. కార్తీక పౌర్ణమి రోజున శివునికి ప్రత్యేకంగా అభిషేకాలు చేయడంతో పాటు ఈరోజు దేశంలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగుతాయి. కార్తీక పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అనే పేరుతో కూడా పిలుస్తారు. కార్తీక పౌర్ణమి వల్ల తెలుగు రాష్ట్రాలలోని దేవాలయాలలో రద్దీ నెలకొంది.

ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలను ఆచరించి పూజలు నిర్వహించడంతో పాటు పాలాభిషేకం, రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఏపీలోని వేర్వేరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈరోజు గంగా నదిలో స్నానం చేసి దక్షిణలు, దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్య ఫలాన్ని పొందే అవకాశం ఉంటుంది.
ఈరోజు ఎవరైతే నెయ్యిని దానం చేస్తారో వాళ్ల సంపద పెరుగుతుంది. ఈరోజు వ్రతాన్ని ఆచరించే వాళ్లకు శివుని అనుగ్రహం లభిస్తుంది. గురువారం రాత్రి 11.55 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.25 గంటల వరకు కార్తీక మాసం పవిత్రమైన సమయంగా ఉంది. ఈరోజు నెయ్యి దానం చేస్తే సంపద పెరిగి గ్రహ దోషాలు తొలగిపోతాయి. కార్తీక పూర్ణిమ(Karthika Pournami 2021) రోజున గుమ్మానికి మామిడి ఆకుల తోరణాన్ని కట్టుకోవాలి.
లక్ష్మీ నారాయణుడికి నెయ్యి వెలిగించి సత్యనారాయణ కథ చెప్పడం ద్వారా మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందవచ్చు. విష్ణువుకు నైవేద్యంగా ఈరోజు పాయసాన్ని సమర్పిస్తే మంచిది. ఈరోజు తులసి మాత దగ్గర దీపం వెలిగించడంతో పాటు శివునికి గంగా జలంతో అభిషేకం చేయడంతో పాటు పచ్చిపాలను సమర్పించాలి. నీటిలో దీపదానం చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నమై ఐశ్వర్యం ప్రాప్తించే అవకాశం ఉంటుంది.
Also Read: సాగు చట్టాల రద్దు: మోడీ పంతం ఓడింది.. రైతే గెలిచాడు!
కేరళలో పుష్ప సందడి.. ఇప్పటి నుంచే స్పెషల్ షోస్‌కు బుకింగ్ స్టార్ట్!