https://oktelugu.com/

దీపావళి రోజున వీటిని చూస్తే డబ్బుకు లోటుండదు.. అవేంటంటే?

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ ఈ పండుగను జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలను చేస్తారు. నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని స్మరించుకోవడం జరుగుతుంది. దీపావళి రోజున ఇంటిని శుభ్రం చేసుకుని సాయంత్రం సమయంలో దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి తమ గృహంలోకి వస్తుందని ప్రజలు విశ్వసిస్తారు. దీపావళి రోజున కొన్ని పక్షులు, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 3, 2021 9:05 am
    Follow us on

    హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ ఈ పండుగను జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలను చేస్తారు. నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని స్మరించుకోవడం జరుగుతుంది. దీపావళి రోజున ఇంటిని శుభ్రం చేసుకుని సాయంత్రం సమయంలో దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి తమ గృహంలోకి వస్తుందని ప్రజలు విశ్వసిస్తారు.

    దీపావళి రోజున కొన్ని పక్షులు, జంతువులు కనిపిస్తే వాళ్ల కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుందని చాలామంది నమ్ముతారు. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ కాగా దీపావళి రోజున గుడ్లగూబ కనిపిస్తే ఆ ఇంట్లోని వాళ్లకు లక్ష్మీదేవి కటాక్షించే అవకాశంతో పాటు వాళ్లు పట్టిందల్లా బంగారం అవుతుంది. పండుగ రోజు రాత్రి గుడ్లగూబ కనిపిస్తే సుఖసంతోషాలు కలిగే అవకాశంతో పాటు ఐశ్వర్యాన్ని పొందవచ్చు.

    దీపావళి పండుగ రోజున పూజ ముగిసిన తర్వాత పిల్లి కనిపిస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం అని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఆ కుటుంబం సంతోషంగా ఉండటంతో పాటు భవిష్యత్తు కాలంలో ఆ ఇంట్లోని వాళ్లకు మంచి జరుగుతుంది. దీపావళి పండుగ రోజున చేతికి ఉండే పుట్టుమచ్చలను చూడటం శుభప్రదం అని చాలామంది భావిస్తారు. దీపావళి రోజున రాత్రి సమయంలో బల్లి కనిపిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది.

    దీపావళి రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి వస్తుందని చాలామంది విశ్వసిస్తారు. నరకచతుర్దశి రోజున దీపాలు పెట్టడం వల్ల నరకం నుంచి స్వర్గానికి వెళతారని శాస్త్రం చెబుతోంది.