ఎస్బీఐ సూపర్ స్కీమ్.. సులువుగా రూ.3 లక్షలు లోన్ పొందే ఛాన్స్?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తీపికబురు అందించింది. కొత్తగా బైక్, స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వాళ్ల కోసం అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈజీ రైడ్ స్కీమ్‌ పేరుతో ఎస్బీఐ ఒక స్కీమ్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్ వల్ల ఎంతోమందికి ప్రయోజనం చేకూరనుంది. ఈ స్కీమ్ లో భాగంగా 3 లక్షల రూపాయల వరకు రుణం పొందే ఛాన్స్ ఉంటుంది. ఎస్బీఐ యోనో యాప్ సహాయంతో […]

Written By: Kusuma Aggunna, Updated On : November 3, 2021 9:15 am
Follow us on

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తీపికబురు అందించింది. కొత్తగా బైక్, స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వాళ్ల కోసం అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈజీ రైడ్ స్కీమ్‌ పేరుతో ఎస్బీఐ ఒక స్కీమ్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్ వల్ల ఎంతోమందికి ప్రయోజనం చేకూరనుంది. ఈ స్కీమ్ లో భాగంగా 3 లక్షల రూపాయల వరకు రుణం పొందే ఛాన్స్ ఉంటుంది.

ఎస్బీఐ యోనో యాప్ సహాయంతో ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎస్బీఐ ఖాతాదారులు ఇంటినుంచే ఈ లోన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎస్బీఐ ద్వారా లోన్ తీసుకున్న వాళ్లకు వడ్డీ రేటు 10.25 శాతంగా ఉండనుందని సమాచారం. కనీసం 20,000 రూపాయల నుంచి 3,00,000 రూపాయల వరకు ఎంతైనా లోన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఎవరైతే ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకుంటారో వాళ్లు లక్ష రూపాయలకు నెలకు 2,560 రూపాయల ఈ.ఎం.ఐ చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ఎవరైతే ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకుంటారో వాళ్లు నాలుగు సంవత్సరాలలో లోన్ ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కారును కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు బైక్ కంటే తక్కువ ధరకు లోన్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

కేవలం 7.5 శాతం వడ్డీ రేటుతో ఎస్బీఐ కారు లోన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకునే వాళ్లు లక్ష రూపాయలకు నెలకు 1832 రూపాయలు ఈ.ఎం.ఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణాలు కాకుండా ఎవరైతే హోమ్ లోన్ ను తీసుకుంటారో వాళ్లకు వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంటుంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కూడా బైక్, కార్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.