Homeపండుగ వైభవంGanesh Festival 2023: వినాయకుడి పూజలు ఈ ఐదు ఉంటే అన్నీ శుభాలే..

Ganesh Festival 2023: వినాయకుడి పూజలు ఈ ఐదు ఉంటే అన్నీ శుభాలే..

Ganesh Festival 2023: వినాయకుడు… ముక్కొటి దేవతల్లో తొలి పూజ అందుకునే దేవుడు. ఆది దేవుడు అయిన గణపతికి ఏటా భాద్రపద శుక్ర చవితి రోజున వినాయక చవితి నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి పది రోజులు వేడుకలు జరుగుతాయి. ఈ ఏడాది దక్షిణ భారత దేశంలో సెప్టెంబర్‌ 18న, ఉత్తర భారత దేశంలో సెప్టెంబర్‌ 19న వినాయక చవితి ప్రారంభమవుతుంది. ప్రతీ కార్యంలో తొలి పూజ అందుకునే వినాయకుడికి నవరాత్రి ఉత్సవాల్లో ఈ ఐదు సమర్పిస్తే అన్నీ శుభాలే జరుగుతాయట. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మరి ఆ 5 ఏంటో తెలుసుకుందామా..

గరిక..
గణేశుడి ఆరాధనలో గరిక లేకుంటే అసంపూర్ణంగా పరిగణిస్తారు. శ్రీ గణేషుడికి గరిక చాలా ప్రియం. దానికి సంబంధించిన అనేక కథలు మన మత గ్రంథాలలో కూడా కనిపిస్తాయి. ఎవరైతే గణేశుడికి గరికను సమర్పిస్తారో అతని జీవితంలో ఆనందం ఉంటుంది. ప్రతీ సంక్షోభం తొలగిపోతుందని నమ్ముతారు.

పసుపు…
హిందూ మతంలో ప్రతీ శుభకార్యంలో పసుపును ఉపయోగిస్తారు. వినాయకుని పూజలో పసుపు ముద్దను ప్రత్యేకంగా సమర్పిస్తారు. దీనిని హరిద్ర అని కూడా అంటారు. పసుపును అనేక జ్యోతిష్య,
తంత్ర నివారణలలో కూడా ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల వచ్చే కష్టాలు దూరమవుతాయని, ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్మకం.

లడ్డూలు..
గణేశుడికి ఏదైనా తీపి పండ్లను అందించవచ్చు. కానీ మోదకాలు, లడ్డూలు గణేశుడికి చాలా ఇష్టమైనవి. గణేశుడిని పూజించినప్పుడల్లా మోతీచూర్‌ లడ్డూలు, మోదకాలు ఖచ్చితంగా నైవేద్యంగా పెడతారు. ఇలా చేయడం వల్ల గణేశుడు తన భక్తులకు సంతోషం ఇస్తాడని, కోరికలు నెరవేరుస్తాడని నమ్మకం.

తమలపాకు ..
పూజలో వినాయకుడికి సమర్పించే వాటిలో తమలపాకు ఒకటి. తమలపాకు వినాయకుని రూపంగా పరిగణిస్తారు. కొన్నిసార్లు, గణేశ్‌ విగ్రహం లేదా చిత్రం లేనట్లయితే, తమలపాకును గణేశుడి రూపంగా పూజిస్తారు. గణేశుడికి తమలపాకులు నైవేద్యంగా పెట్టడం వల్ల ఇల్లు శుభప్రదంగా ఉంటుంది.

కొబ్బరికాయ..
కొబ్బరిని దాదాపు ప్రతీ శుభకార్యాలలో కూడా ఉపయోగిస్తారు. కొబ్బరికాయను శ్రీఫలం అంటారు. శ్రీ అంటే లక్ష్మి అంటే కొబ్బరికాయ లక్ష్మీదేవికి ఇష్టమైన పండు. గణేశుడికి కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే, దానిని బూరు తీయకుండా పూర్తిగా మాత్రమే సమర్పించండి. దీని నుంచి శుభ ఫలితాలను కూడా పొందవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version