Harsha Sai: మెగా సినిమాతో హీరో గా హర్ష సాయి చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా..?

ఈ సినిమాకి సంబంధించిన టీజర్ చూస్తున్నంత సేపు ఎక్సైట్ మెంట్ ని కలిగించింది.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కూడా ప్రతి సీన్ ఎక్సైజ్ మెంట్ తో ఉంటుందని ఇప్పటికే సినిమా యూనిట్ చెప్తున్నారు.

Written By: Gopi, Updated On : September 17, 2023 5:05 pm

Harsha Sai

Follow us on

Harsha Sai: ప్రస్తుతం యూట్యూబ్ లో పాపులర్ అయిన వాళ్లు చాలా మంది ఇండస్ట్రీలో రైటర్లుగా, హీరోలుగా చేస్తూ మంచి గుర్తింపును పొందుతున్నారు.యూట్యూబ్ లో తన వీడియోల ద్వారా బాగా ఫేమస్ అయిన హర్ష సాయి కూడా ప్రస్తుతం వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటివరకు యూట్యూబ్ లో చాలామందికి హెల్ప్ చేస్తూ వీడియోలను పెట్టి దాని ద్వారా మంచి గుర్తింపు పొందిన హర్ష సాయి ప్రస్తుతం మెగా అనే ఒక సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. దీనికి సంబంధించిన ఒక టీజర్ కూడా ఇవాళ్ల రిలీజ్ అవ్వడం జరిగింది.అది కూడా చాలా ప్రామిసింగ్ గా ఉండటంతో హర్ష సాయి ఈ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోతాడు అని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి రైటర్ , డైరెక్టర్, హీరో మూడు తనే కావడం విశేషం…

ఈ సినిమాకి సంబంధించిన టీజర్ చూస్తున్నంత సేపు ఎక్సైట్ మెంట్ ని కలిగించింది.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కూడా ప్రతి సీన్ ఎక్సైజ్ మెంట్ తో ఉంటుందని ఇప్పటికే సినిమా యూనిట్ చెప్తున్నారు. ఒకవేళ ఈ సినిమా కూడా మంచి ఎక్సైట్ మెంట్ ని కలిగిస్తూ సాధారణ ప్రేక్షకుడిని అలరించగలిగితే హర్ష సాయి హీరోగా సక్సెస్ అయినట్టే అలాగే డైరెక్షన్ కూడా తనే చేస్తున్నాడు కాబట్టి డైరెక్టర్ గా కూడా సక్సెస్ అవుతాడు.అయితే ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించడంలో ఏమాత్రం ఫెయిల్ అయిన హర్ష సాయి హీరోగా వేసిన స్టెప్ ఫెయిల్ అవుతుందనే చెప్పాలి.కానీ ఈ టీజర్ ను చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమాలో ఏదో ఒక కొత్త విషయాన్ని హర్ష సాయి చెప్పాలని చూస్తున్నాడు అని అంటున్నారు. నిజానికి హర్ష సాయి యూట్యూబ్ లో చేసే వీడియోల మీద కొన్ని నెగిటివ్ కామెంట్లు కూడ వినిపిస్తూ ఉంటాయి.ఎందుకంటే హర్ష సాయి కొంతమందికి సహాయం చేసినట్టుగా కొన్ని వీడియోల్ని తీస్తూ వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ద్వారా సహాయం చేసిన దానికంటే ఎక్కువగా యూట్యూబ్ రూపంలో డబ్బులు సంపాదిస్తున్నాడు. అనే ఒక నెగిటివ్ కామెంట్ అయితే ఆయన మీద చేస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే హీరోగా ఆయన సక్సెస్ కొట్టాలంటే ఈ సినిమాలో మ్యాటర్ అనేది పక్కాగా ఉండాలి. అది ఉందో లేదో తెలియాలంటే మనం ఇంక కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు…