Homeపండుగ వైభవంHariyali Teej: హరియాలీ తీజ్ 2023 ఏ రోజు వస్తుంది, దీని ప్రాముఖ్యత, పాటించవలసిన ఆచారాలు…

Hariyali Teej: హరియాలీ తీజ్ 2023 ఏ రోజు వస్తుంది, దీని ప్రాముఖ్యత, పాటించవలసిన ఆచారాలు…

Hariyali Teej: ఆగస్టు నెలలోని నాగపంచమి కి రెండు రోజుల ముందు జరుపుకునేటటువంటి ఒక పవిత్రమైన హిందువుల పండుగ హరియాలీ తీజ్. పరమశివుడు పార్వతీదేవిని తన భార్యగా అంగీకరించిన ఈ శుభదినాన్ని భక్తులు ఉపవాసం, ప్రార్థనలతో పాటు ఒక ఉత్సవంలో జరుపుకుంటారు. శివుడు పార్వతి ఒకటైన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ముత్తైదువులకు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు.

ఈ సంవత్సరం ఈ పండుగ ఆగస్టు 19 వ తారీఖున వస్తుంది. అసలు ఈ హరియాలీ తీజ్ అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత, ఈ పండుగ జరపడానికి విధివిధానాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. సావన్ మరియు భాద్రపద మాసాలలో జరుపుకునే ఈ పండుగను హరియాలీ తీజ్, హర్తాళికా తీజ్ ,కజ్రీ తీజ్ అని అంటారు. శ్రావణమాసంలోని శుక్లపక్షం యొక్క మూడవ రోజున దీన్ని జరుపుకుంటారు.

ఆగస్టు 19న ఇది రాత్రి 8 :01 నిమిషలకు ప్రారంభమై తిరిగి 10:19 నిమిషాలకు ముగుస్తుంది. ఈ పండుగను ఎక్కువగా రాజస్థాన్ ,మధ్యప్రదేశ్ ,బీహార్ ,జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ ప్రదేశాలలో జరుపుకుంటారు. దీనికోసం ఆడవారు పొద్దుట నుంచి సాయంత్రం వరకు మీరు కూడా తీసుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు. ఆ తర్వాత పూజ చేసి భర్త ఆశీర్వాదంతో వ్రతాన్ని ముగిస్తారు.

పురాణాల ప్రకారం పార్వతీదేవి 107 సార్లు శివుడు చేత భార్యగా తిరస్కరించబడి 108 వ జన్మలో అంగీకారం పొందుతుంది. అందుకే నార్త్ ఇండియన్స్ ఈ రోజును తీజ్ మాతగా గౌరవిస్తారు. ఈరోజు హిందూ స్త్రీలు తమ భర్తల ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి కోసం పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తారు. ఈ పండుగ ఎక్కువగా ఉత్తర భారత దేశంలో జరుపుకుంటారు. శ్రావణమాసంలోని శుక్లపక్షం మూడవ రోజున వచ్చే ఈ పండుగ వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో మన చుట్టూ పచ్చదనంతో ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి ఈ పండుగకు హరియాలీ తీజ్ అనే పేరు వచ్చింది. సాయంత్రం వరకు ఉపవాసం ఉన్న స్త్రీలు ,ఆ తర్వాత పార్వతీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించి భర్త చేతుల మీదగా ఉపవాస దీక్షను విరమిస్తారు.

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular