Holi 2024: ప్రతీ ఏడాది పాల్గుణ మాసంలో వచ్చే హోలీ వేడుకలను దేశ ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటారు. హద్దు, పద్దు లేకుండా ఆనందంగా ఉంటారు. చిన్నా, పెద్దా అంతా కలిసి రంగులు పూసుకుంటారు. అయితే హోలీని దేశ వ్యాప్తంగా ప్రజలు వివిధ పద్ధతుల్లో నిర్వహించుకుంటారు. హోలీకి ఒకరోజు ముందు కామదహనం నిర్వహించి, ఆ మరుసటి రోజు ఉదయం నుంచే రంగులతో గోల గోల చేస్తారు. 2024 మార్చి 25న హోలీ పండుగ రాబోతుంది. ఈరోజు వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఆసక్తి విషయంపై తీవ్రంగా చర్చ సాగుతోంది.
హోలీ పండుగ అనగానే కామదహనం, రంగులు చల్లుకోవడం మాత్రమే తెలుసు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ వేడుకలు ప్రారంభించే ముందు రాధా కృష్ణులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. హోలీ పండుగపై వివిధ కథనాలు ఉన్నాయి. కానీ ఇంద్రజాల్ మొక్కతో పూజ చేస్తే అష్టఐశ్వర్యాలు, సంతోషాలు కలుగుతాయని కొందరు చెబతున్నారు. అయితే ఇంద్రజాల్ మొక్క మహిమ ఏంటి? ఈ మొక్క ఎక్కడ దొరుకుతుంది? దాని విశేషాలు ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..
కొన్ని పురాణాల ప్రకారం.. ఇంద్రుడు రావణాసురుడితో యుద్ధం చేస్తాడు. ఈ సమయంలో సముద్రంలో ఇంద్రుడు మాయాజాలాన్ని ప్రదర్శిస్తారు. ఆ మాయజాలం మొక్కగా మారిందట.క్షీర సాగర మథనం నుంచి అనేక వస్తువులు వచ్చినట్లే ఈ మొక్క కూడా వచ్చిందట. ఈ మొక్క అప్పటి నుంచి ప్రముఖంగా నిలిచింది. ప్రస్తుతం ఇది రామేశ్వరం, అండమాన్, నికోబార్, లక్ష్యద్వీప్, సింగపూర్ సముద్ర తీరంలో దొరుకుతుందట.
కష్టాల్లో ఉన్నవారు, వ్యాపారంలో అభివృద్ధి చెందాలనుకునేవారు ఈ మొక్కకు ప్రత్యేకంగా పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు. ముఖ్యంగా హోలీ రోజున దీనిని ఒక ప్రేమ్ లో ఉంచి, దానిని ఉత్తర గోడకు తగిలించుకొని ప్రత్యేక పూజలు చేయాలంటున్నారు. ఇది ఇంట్లో ఉండడం వల్ల నరదృష్టి, వాస్తు దోషాల నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు. ఈ పటాన్ని హోలీ పౌర్ణమి రోజు పూజిస్తే మంచిదని అంటున్నారు.