Maruti Suzuki: 16000 కార్లు రీకాల్ ప్రకటించిన మారుతి.. ఎందుకో తెలుసా?

మారుతి కంపెనీ నుంచి వ్యాగన్ ఆర్ కారు ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది. వ్యాగన్ ఆర్ 1.0 లీటర్ తో పాటు 1.2 లీటర్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 4 స్పీకర్ ఆడియో సిస్టమ్, హిల్ హోల్డ్ ఆసిస్ట్, స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్, కీ లెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Written By: Srinivas, Updated On : March 23, 2024 4:35 pm

Maruti Suzuki

Follow us on

Maruti Suzuki: దేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి కంపెనీ అమ్మకాల్లో ఎప్పుడూ అగ్రగామిగా ఉంటుంది. వినియోగదారులను నిత్యం ఆకర్షిస్తూ.. ఆకట్టుకునే డిజైన్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే తాజాగా మారుతి కంపెనీ తన కార్ల వినియోగదారులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన కార్లలో ఉన్న సమస్యలు పరిష్కారం కోసం ఓ అవకాశాన్ని కల్పించింది. కొన్ని కార్లలో ఏదైనా లోపం ఉంటే వాటిని ఉచితంగా రీసైకిల్ చేయనున్నట్లు పేర్కొంది. మరి ఆ కార్లు ఏవో చూద్దాం..

మారుతి కంపెనీ నుంచి వ్యాగన్ ఆర్ కారు ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది. వ్యాగన్ ఆర్ 1.0 లీటర్ తో పాటు 1.2 లీటర్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 4 స్పీకర్ ఆడియో సిస్టమ్, హిల్ హోల్డ్ ఆసిస్ట్, స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్, కీ లెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో సేప్టీ కోసం రెండు ఎయిర్ బ్యాగులు, స్పీడ్ అలర్ట్, రియల్ పార్కింగ్ సెన్సార్ ఉన్నాయి.

బాలెనో కారు విషయానికొస్తే ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు సీవీటీ ఆప్షన్ కూడా ఉంది. బాలెనో కారులో 318 లీటర్ల బూట్ స్పేస్ ప్రత్యేక ఆకర్షణగా నిలస్తుంది. 5 సీటర్ గా ఉన్న ఈ కారు దేశంలోని బెస్ట్ సెల్లర్లలో ఒకటిగా నిలిచింది. దీనిని ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి తీసుకురానున్నారు. వెహికల్ రేంజ్ ను పెంచడంతో పాటు డైరెక్ట్ ప్రొఫైల్ కాకుండా ఎలక్ట్రిక్ మోటార్ తో పవర్ ను జనరేట్ చేస్తుంది.

తాజాగా ఈ రెండు కార్లపై కంపెనీ ఆఫర్లను ప్రకటించింది. 1600లకు పైగా బాలెనో, వ్యాగన్ ఆర్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ మార్చి 22న తెలిపింది. 2019 జూలై 30 నుంచి నవంబర్ 1 మధ్య తయారైన 11,851 బాలెనో, 4190 వ్యాగన్ ఆర్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ఎక్చేంజీలకు సమాచారం ఇచ్చింది. అంటే ఇంధన పంప్ మోటార్ భాగంలో ఏదైనా లోపం ఉంటే సమస్యలు తలెత్తుతాయని, అందువల్ల లోపాలు ఉన్న భాగాలను ఉచితంగా మార్చి ఇస్తున్నట్లు ప్రకటించింది.