Mahashivratri 2024: మహాశివరాత్రి హిందువుల పవిత్ర పండుగ. ఈరోజు శివుడిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే అనుగ్రహిస్తాడని నమ్ముతారు. అందుకే చాలా మంది ఈరోజు ఉపవాసం ఉండడమే కాకుండా రాత్రి జాగరణ చేస్తారు. భక్తితో పరమశివుడిని కొలుస్తారు. అయితే ఈరోజు ఉపవాసం ఉండి కూడా రకరకాల ఆహారం తీసుకుంటారు కొందరు. అయితే ఆరోజు ఈ మూడు పొరపాటున కూడా తినకూడదని సూచిస్తున్నారు పండితులు.
ఇవి తినాలి..
మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉన్న సమయంలో ధాన్యాలతో చేసిన ఆహారం తినడం నిషేధం. పండుగ రోజు మహాదేవ్, పార్వతి వివాహం జరిగింది. ఈ రోజున శివుడు, పార్వతిని పూజించిన తర్వాతనే ఏదైనా తినాలి. అది కూడా సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈ రోజు పండ్లు తినవచ్చు. పిండితో చేసిన హల్వా, పూరీ లేదా ఉప్పు హల్వా తినవచ్చు. ఈ రోజు బత్తాయి తినడం చాలా శుభప్రదంగా భావిస్తారు. టీ, పాలు, మజ్జిగ తాగవచ్చు. ఇక ఉపవాసం ఉండేవారు శెనగలు, బంగాళాదుంపలు, బత్తాయి పిండితో రాళ్ల ఉప్పు కలిపి చేసిన వంటకాలు తినవచ్చు.
వీటిని అస్సలు తినొద్దు..
ఇక మహాశిరాత్రి రోజున ఉపవాసం పాటించేవారు పొరపాటున కూడా ఇవి తినొద్దని పండితులు సూచిస్తున్నారు. గోధుమలు, బియ్యం, పప్పులతో చేసిన ఆహారాన్ని అస్సలు తీసుకోవద్దు. వెల్లుల్లి, ఉల్లి, మాంసం వంటివి తీసుకోవద్దు. మద్యం సేవించకూడదు. ఉపవాసం ఉండేవారు పొరపాటున కూడా ఎవరినీ దుర్భాషలాడొద్దు.