Diwali wishes Telugu 2021 and Diwali Images Telugu 2021, దీపావళి శుభాకాంక్షలు 2021: Diwali 2021: దీపావళి పండుగ అంటే ఏమిటి.. ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?Deepaavali 2021: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో పండుగలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ఇలా ఎంతో ఘనంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఎంతో ముఖ్యమైనది. ఈ దీపావళి పండుగను దేశవ్యాప్తంగా హిందూ ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. Diwali wishes Telugu 2021 ఇక ఇంటిలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ పండుగ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. దీపావళి పండుగ అంటే వివిధ రకాల మిఠాయిలు, కొత్త బట్టలు, టపాకాయలను కాల్చడమేనని చాలామంది భావిస్తారు. అయితే చాలా మందికి దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారు? దీపావళి పండుగ ప్రాధాన్యత ఏమిటి? అనే విషయాలు చాలా మందికి తెలియవు. అయితే ఈ పండుగ ప్రాధాన్యత ఏమిటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
పురాణాల ప్రకారం నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను ఎన్నో చిత్రహింసలకు గురి చేసేవారు. ఈ క్రమంలోనే నరకాసురుడి బాధ నుంచి ప్రజలను రక్షించడం కోసం సాక్షాత్తు అమ్మవారు నరకాసురుడిని వధించింది. ఇలా ఆ రాక్షసుడిని సంహరించినందుకుగాను మరుసటి రోజు పెద్దఎత్తున ప్రజలందరూ సంతోషంతో దీపావళి పండుగను జరుపుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. అదే విధంగా 14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి రావడంతో అయోధ్య ప్రజలందరూ సంతోషంతో దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది.
ఇలా దీపావళి రోజు మన జీవితంలో కమ్ముకున్న చీకట్లను పారద్రోలి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని భావిస్తూ పెద్ద ఎత్తున ఈ పండుగ రోజు దీపాలను పెట్టి టపాకాయలు కాలుస్తూ ఎంతో సంతోషంగా పండుగ చేసుకుంటారు. ఇక నరకచతుర్దశి రోజు పలు ప్రాంతాలలో నరకాసురుడి బొమ్మలు దహించి పండుగ జరుపుకుంటారు. అదేవిధంగా ఈ పండుగకు ఆడపడుచులు ఇంటికి వచ్చి తమ సోదరులకు తండ్రికి కుంకుమ బొట్లు పెట్టి నూనెతో తలంటి హారతినిచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు.
ప్రతి ఏడాది దీపావళి పండుగ ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాము.ఈ పండుగ రోజు లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ రకాల మిఠాయిలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అయితే లక్ష్మీదేవికి సాయంత్రం పూజ చేసి ఈ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఇక పోతే ఈ ఏడాది నవంబర్ 4వ తేదీ దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకోనున్నారు.
అయితే లక్ష్మీదేవికి సాయంత్రం పూజ చేసి ఈ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఇక పోతే ఈ ఏడాది నవంబర్ 4వ తేదీ దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకోనున్నారు.