https://oktelugu.com/

Telangana Devudu: నవంవర్ 12 న విడుదల కానున్న ” తెలంగాణ దేవుడు ” చిత్రం…

Telangana Devudu: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్ ట్రెండ్ జోరుగా నడుస్తుందనే చెప్పాలి. ఇటీవల మాజీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నందమూరి తారక రామారావు, జయలలిత జీవితాల ఆధారంగా సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జీవితం ఆధారంగా…  తెలంగాణ దేవుడు అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో నటిస్తుండగా… హరీష్‌ వడత్యా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి  మొహహ్మద్‌ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 29, 2021 12:42 pm
    Follow us on

    Telangana Devudu: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్ ట్రెండ్ జోరుగా నడుస్తుందనే చెప్పాలి. ఇటీవల మాజీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నందమూరి తారక రామారావు, జయలలిత జీవితాల ఆధారంగా సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జీవితం ఆధారంగా…  తెలంగాణ దేవుడు అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో నటిస్తుండగా… హరీష్‌ వడత్యా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి  మొహహ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మాతగా చేస్తుండగా… జిషాన్‌ ఉస్మాన్‌ కథానాయకుడుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఆ అప్డేట్ ను విడుదల చేశారు.

    telangana devudu movie releasing on november 12

    కాగా ఈ సినిమాను నవంబరు 12న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న విశ్స్యమ్ తెలిసిందే. ఈ మేరకు ఓ పోస్టర్​ను మూవీ యూనిట్ విడుదల చేసింది. అలానే బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, వెంకట్‌, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నా. చరిత్ర సృష్టించిన ఓ తెలంగాణ ఉద్యమనాయకుడి పాత్రలో నటించడం గర్వంగా ఉంది” అని అన్నారు.

    ఇంత గొప్ప చిత్రం తెరకెక్కించే అవకాశమిచ్చినందుకు నిర్మాతకు థ్యాంక్స్​. ఆయనతో పాటు నటీనటుల సహకారం వల్ల చిత్రం బాగా వచ్చిందన్నారు” దర్శకుడు హరీశ్​. ముఖ్యమంత్రి కేసీఆర్​ బయోపిక్​గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో.. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏం జరిగిందనేది కళ్లకు కట్టినట్లు చూపించాం. ఈ తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఓ నిఘంటువు” అని నిర్మాత అన్నారు.