https://oktelugu.com/

Heroine : ఈ పాప గుర్తుందా? ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్న హీరోయిన్ ..

ఇక సూర్య నటించిన సినిమాల్లో రాక్షసుడు సినిమా గుర్తుండే ఉంటుంది. తమిళ్ లో వచ్చిన ఈ సినిమా తెలుగులో డబ్ అయింది. ఈ మూవీలో సూర్య డ్యూయల్ రోల్‌లో కనిపించి అదరగొట్టాడు

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 28, 2024 / 03:51 PM IST
    Follow us on

    Heroine : ఒకప్పుడు సీనియర్ హీరోయిన్ ల వద్ద బాలనటులుగా చేసిన చాలా మంది ఇప్పుడు కూడా ఇండస్ట్రీలోనే కంటిన్యూ అవుతున్నారు. కొందరు హీరోహీరోయిన్ లు ఇప్పుడు సీనియర్ నటులుగా కూడా కంటిన్యూ అవుతున్నారు. అయితే చిన్నపిల్లలుగా మెప్పించిన వారు ఇప్పుడు హీరోహీరోయిన్ లుగా కూడా మెప్పిస్తున్నారు. కొందరు స్టార్ హీరోలుగా కూడా ఎదిగారు. తేజ సజ్జ, నిఖిల్, మహేష్ బాబులు బాల్యంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే రేంజ్ లో సక్సెస్ తో దూసుకొని పోతున్నారు. అయితే ఇప్పుడు అలాంటి ఓ నటి గురించి కూడా తెలుసుకుందాం. బాలనటిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న బుజ్జి పాప ఇప్పుడు మంచి రోల్ లో కనిపిస్తుంది. మరి ఆమె ఎవరు అనుకుంటున్నారా? అయితే ఓ లుక్ వేయండి.

    తమిళ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయనకు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తమిళ్ స్టార్ హీరో సూర్య త్వరలో కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా శివ దర్శకత్వంలో రానుంది. ఈ సినిమాలో సూర్య చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడని టాక్. అంతేకాదు ఈ సినిమాలో యానిమల్ విలన్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే హీరో సూర్యకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలు తెలుగులోనూ హిట్ ను సంపాదిస్తాయి.

    అయితే గజినీ సినిమా నుంచి తెలుగులో సూర్య సినిమాలకు చాలా డిమాండ్ ఏర్పడింది. సూర్య నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అవుతుంటాయి. తమిళ్ తో పాటు తెలుగులోనూ సూర్య సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయి కాబట్టి కలెక్షన్స్ కూడా భారీగా వసూల్ చేస్తున్నాయి. ఇక సూర్య ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ముందుంటాడు. కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు.

    ఇక సూర్య నటించిన సినిమాల్లో రాక్షసుడు సినిమా గుర్తుండే ఉంటుంది. తమిళ్ లో వచ్చిన ఈ సినిమా తెలుగులో డబ్ అయింది. ఈ మూవీలో సూర్య డ్యూయల్ రోల్‌లో కనిపించి అదరగొట్టాడు. రాక్షసుడు సినిమాలో తండ్రి కొడుకులుగా నటించాడు సూర్య. అయితే ఈ సినిమాలో సూర్య కూతురిగా ఓ చిన్నారి నటించింది. ఆమె గుర్తుందా..? ఆ చిన్నారి ఇప్పుడు ఎలా మీకు తెలుసా..? ఆ చిన్నారి పేరు యువినా పార్థవి. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో, సీరియల్స్ లో నటించింది. ఇక ఇప్పుడు ఆమె హీరోయిన్ గా ఇరగదీస్తుంది.

    అంతే కాదు అజిత్ వీరం, విజయ్ దళపతి కత్తితో పాటు మరిన్ని హిట్ సినిమాల్లో కూడా బాల నటిగా నటించింది యువినా పార్థవి. తమిళ్‌తో పాటు కన్నడ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఈ భామ కోసం సోషల్ మీడియాలో వెతుకుతున్నారు కొందరు నెటిజన్స్. ఇంకే ఈ అమ్మడు గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఇక రీసెంట్ గా ఈ చిన్నది జయం రవి హీరోగా నటించిన సైరన్ సినిమాలో మంచి పాత్రను పోషించింది.