Devara: దేవర సినిమా రిలీజ్ అవ్వకుండానే రివ్యూ లు ఇచ్చేస్తున్న యూట్యూబర్స్…దీని మీద సినిమా యూనిట్ రియాక్షన్ ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ల స్ట్రాటజీని వాడుతూ సక్సెస్ లను అందుకుంటుంటారు. ఇక ఫైనల్ గా ఏది చేసిన కూడా ఇక్కడ సక్సెస్ అనేది మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవడానికి ప్రతి ఒక్క దర్శకుడు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు...

Written By: Gopi, Updated On : September 16, 2024 10:22 am

Devara

Follow us on

Devara: ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘దేవర ‘ సినిమా మీద విపరీతమైన చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే దేవర సినిమా రిలీజ్ కి మరొక పది రోజుల సమయం ఉన్నప్పటికీ ఈ సినిమా ట్రైలర్ ని మాత్రం కొంత మంది యూట్యూబర్స్ విపరీతమైన ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ట్రైలర్ ను బట్టి కథను కూడా చెప్పేస్తూ సినిమాలో ఏమీ లేదని తేల్చేస్తున్నారు. దీంతో సినిమా మేకర్స్ ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నారు. నిజానికి ఒక సినిమా ట్రైలర్ ను బట్టి సినిమా ఎలా ఉంటుంది అనేది అంచనా వేయడం అంత ఈజీ కాదు. కొన్ని సినిమాల ట్రైలర్లు అద్భుతంగా ఉన్నప్పటికీ సినిమా మాత్రం డిజాస్టర్లుగా మారుతుంటాయి. అలాగే ఇంక కొన్ని సినిమాల్లో ట్రైలర్లు అస్సలు బాగుండవు కానీ ఆ సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలుస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి సందర్భంలో దేవర సినిమా మీద యూట్యూబ్ లో చేస్తున్న రచ్చ మాత్రం అంతా ఇంతా కాదు. ఇక దీని మీద సినిమా మేకర్స్ కూడా కొంతవరకు రెస్పాండ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సినిమా రిలీజ్ కి మరొక 10 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే సినిమా గురించిన రివ్యూలు ఎందుకు ఇస్తున్నారు అంటూ చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి దేవర సినిమా మీద పెరుగుతున్న నెగిటివిటీకి యూట్యూబ్ లో ఇచ్చే రివ్యూలు కూడా కారణమే అంటూ కొంత మంది ఎన్టీఆర్ అభిమానుల సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

మరి ఏది ఏమైనప్పటికీ దేవర సినిమా సక్సెస్ ఫుల్ గా నిలవాలి అంటే మాత్రం సినిమాలో ఏదో ఒక మ్యాజిక్ అయితే జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్టీఆర్ తన మాస్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తాడా? కొరటాల తన పెన్ను పవర్ తో అందరికీ మాస్ డైలాగులను పరిచయం చేస్తాడా? అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.

ఇక కథపరంగా చూసుకుంటే ఈ సినిమా కథ లో పెద్దగా వేరియేషన్స్ అయితే ఏమీ లేవు. గత కొద్ది రోజుల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కథలు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కొరటాల మాత్రం ఇలాంటి కథను ఎంచుకొని అందులో మాస్ ఎలిమెంట్స్ ని బాగా రంగరించినట్టుగా తెలుస్తోంది. మరి ఫైనల్ గా ఈ సినిమాని కొరటాల ఒక మాస్ సినిమాగా నిలిపాడా?

లేదంటే అల్ట్రా డిజాస్టర్ గా నిలపబోతున్నాడా? అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది… ఇక యూట్యూబ్ లో వస్తున్న రివ్యూల మీద కూడా సినిమా యూనిట్ ఫోకస్ చేసి వాళ్ల మీద చర్యలు తీసుకోబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…