Periods : అమ్మాయిలకు పీరియడ్స్ సమయంలో చాలా నీరసంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎలాంటి పనులు చేయడానికి ఇష్టపెట్టుకోరు. ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. నెలసరిలో ఉండే మూడ్ స్వింగ్స్ వల్ల చాలా ఇబ్బంది పడతారు. ఎక్కువ మంది అమ్మాయిలకి కడుపు నొప్పి, కాళ్లు నొప్పులు వంటివి వస్తుంటాయి. అయితే పీరియడ్స్ సమయంలో చాలా మందికి కొన్ని సందేహాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో కొందరు కలయికలో పాల్గొనవచ్చా లేదా అని ఆలోచిస్తుంటారు. కొంతమంది ఎలాంటి సమస్యలు ఉండవు. కలయికలో పాల్గొనవచ్చని అంటుంటారు. మరి కొందరు పాల్గొనకూడదని అంటుంటారు. మరి ఇందులో నిజమేంత? ఇలాంటి సమయంలో కలయికలో పాల్గొనవచ్చా? పాల్గొంటే ఎలాంటి సమస్యలు వస్తాయి? పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.
పీరియడ్స్ సమయంలో నీరసంగా ఉంటుందని, కలయికలో పాల్గొనకూడదని చాలా మంది భావిస్తారు. కానీ ఎవరి ఓపిక బట్టి వాళ్లు కలయికలో పాల్గొనవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. పీరియడ్స్ లో ఉన్నప్పుడు కొందరికి నీరసంగా ఉండటం వల్ల కలయికకి దూరంగా ఉంటారు. అంతే తప్ప కలయికలో పాల్గొనకూడదని లేదని అంటున్నారు. అయితే కొందరి అమ్మాయిలకు నెలసరిలో కలవడం వల్ల మూడ్ స్వింగ్స్ మారుతాయని, కడుపులో నొప్పి తగ్గుతుందని భావిస్తారు. నెలసరిలో కలవడం వల్ల కొందరు మహిళలు భావ ప్రాప్తికి లోనవుతారు. ఇలాంటి సమయంలో వాళ్లకు ఎక్కువగా ఫీలింగ్స్ వస్తాయని అంటుంటారు. ఈ సమయంలో కలయికలో పాల్గొనవచ్చు. నెలసరిలో కలయిక పూర్తిగా సురక్షితం. అయితే జాగ్రతలు తీసుకుంటా కలయికలో పాల్గొనాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు ఉండవు. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా నెలసరిలో కలయికలో పాల్గొనండి. అయితే కలయికకు ముందు.. శుభ్రం చేసుకుని అప్పుడు పాల్గొనాలి. జాగ్రత్తలు పాటించకుండా చేయడం వల్ల యోని ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నెలసరిలో చాలా మంది అమ్మాయిలను ఇంటి లోపలికి రానివ్వకపోవడం, గుడికి వెళ్లానివ్వకపోవడం, దేనిని ముట్టుకోకుండా ఇంట్లో ఉండాలని కండిషన్స్ పెడుతుంటారు. ఇవన్నీ పురాతన కాలం నుంచి పాటిస్తున్నారు. వీటిలాగే కలయికలో పాల్గొనకూడదని అందరూ అనుకుంటారు. కానీ ఇది కేవలం మూఢ నమ్మకం మాత్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే జాగ్రత్తలు పాటించకుండా కలయికలో పాల్గొంటే.. కొందరికి సుఖ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సుఖ వ్యాధులు రావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మళ్లీ వీటిని తగ్గించడం చాలా కష్టం. కాబట్టి కలయికలో పాల్గొనే ముందు తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు ఉండవు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.