Spirit: అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో పెను ప్రభంజనాన్ని సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే…ఇక గత సంవత్సరం ఆయన రన్బీర్ కపూర్ తో చేసిన ‘అనిమల్ ‘ సినిమా భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా బోల్డ్ సినిమా కంటెంట్ గా తెరకెక్కి ఘన విజయాన్ని సాధించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఆయన చేసే సినిమాల్లో ఎమోషన్స్, ఎలివేషన్స్ భారీ రేంజ్ లో ఉంటూనే బోల్డ్ సీన్స్ కూడా అంతే ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇక ప్రతి ప్రేక్షకుడు ఆయన సినిమాని చూస్తున్నప్పటికీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక లేడీస్ నుంచి మాత్రం ఆయన సినిమాల మీద భారీగా వ్యతిరేకత అయితే వస్తూ ఉంటుంది. కానీ సందీప్ మాత్రం అవన్నీ పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ‘స్పిరిట్ ‘ సినిమాలో ప్రభాస్ ఒక రూత్ లెస్ కాప్ గా కనిపించబోతున్నట్టు గా కూడా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కించి భారీ వసూళ్లను రాబట్టడమే లక్ష్యంగా సందీప్ రెడ్డి వంగ ముందుకు కదులుతున్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ సినిమా కోసం తన డేట్స్ ను కేటాయించాడు. ఈ సినిమా తర్వాత స్పిరిట్ సినిమాని తెరకెక్కించే పనిలో సందీప్ వంగా ఉన్నాడు.
అయితే ప్రభాస్ డేట్స్ పూర్తిస్థాయిలో దొరికిన తర్వాతే ఆయన ప్రభాస్ మేకోవర్ గానీ ఆయన బాడీ లాంగ్వేజ్ ని గాని మొత్తం మార్చేసి తన కంట్రోల్లోకి తెచ్చుకొని అప్పుడు ఆ సినిమాని చేయాలని సందీప్ వంగా అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ తమ్ముడి క్యారెక్టర్ కూడా సినిమాలో ఎక్కువగా ఇంపాక్ట్ ను చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఆ పాత్ర ఎవరు చేస్తే బాగుంటుంది అనే విషయంలో సందీప్ చాలా రోజుల నుంచి తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎట్టకేలకు ఈ క్యారెక్టర్ కి ఒక స్టార్ హీరోని ఫిక్స్ చేయాలనే ఉద్దేశ్యంలో సందీప్ వంగ ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక అందులో భాగంగానే తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న శర్వానంద్ ని ఆ క్యారెక్టర్ కోసం తీసుకోవాలని సందీప్ చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక సందీప్ వంగా కి శర్వానంద్ మంచి ఫ్రెండ్, అలాగే ప్రభాస్ కి కూడా శర్వానంద్ చాలా మంచి ఫ్రెండ్ కావడంతో ఈ సినిమాకి శర్వానంద్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది… ఇక స్పిరిట్ సినిమా సెట్స్ మీదికి వెళ్ళకముందే భారీ అంచనాలను పెంచుతున్న సందీప్ వంగా సెట్స్ మీదికి వెళ్ళిన తర్వాత ఇంకెన్ని హంగులు ఆర్భాటాలు చేస్తాడో తెలియాల్సి ఉంది…