https://oktelugu.com/

Jr Ntr: ఎవరు మీలో కోటీశ్వరులు షో లో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తారక్

Jr Ntr: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’… ప్రస్తుతం బుల్లితెరపై ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్న రియాలిటీ షో. ఈ షో కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఇందులో ఆటతో పాటు ఆడే కంటెస్టెంట్స్ తో వినోదం కూడా అంతే స్థాయిలో ఉంటుందని తెలిసిందే. గతం లో బిగ్ బాస్ సీజన్ 1 కి హోస్ట్ గా చేసి యాంకరింగ్ లోను తన సత్తా చాటిన విషయం అందరికి తెలిసిందే. అదే విధంగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 26, 2021 / 12:33 PM IST
    Follow us on

    Jr Ntr: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’… ప్రస్తుతం బుల్లితెరపై ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్న రియాలిటీ షో. ఈ షో కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఇందులో ఆటతో పాటు ఆడే కంటెస్టెంట్స్ తో వినోదం కూడా అంతే స్థాయిలో ఉంటుందని తెలిసిందే. గతం లో బిగ్ బాస్ సీజన్ 1 కి హోస్ట్ గా చేసి యాంకరింగ్ లోను తన సత్తా చాటిన విషయం అందరికి తెలిసిందే. అదే విధంగా ఇప్పుడు కూడా తనదైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ… ఈ షోకు గతంలో ఎన్నడు లేని విధంగా టీఆర్ఫీలను పొందేలా చేస్తున్నారు. అయితే తాజాగా గత ఎపిసోడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

    కంటస్టెంట్ లతో సరదాగా మాట్లాడుతూ షో ని రక్తికట్టిస్తూ ఉంటారు తారక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో తనకి బాగా ఇష్టం అయిన సినిమా “తొలిప్రేమ” సినిమా అని చెప్పడం ఇద్దరి హీరోల అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతుంది. మొత్తానికి ఈ షో ద్వారా ఓ స్టార్ హీరో అభిమానులు ఇంకో స్టార్ హీరో అభిమానులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పర్చుకున్నట్టు అవుతుంది. ఇక ఇదే షోను గతంలో కింగ్ నాగార్జున‌, మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ లుగా ‘మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు’ అనే పేరుతో మా టీవీలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సారి అదే షోను జెమినీ టీవీలో ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ అనే పేరుతో ప్రసారం చేస్తున్నారు. ప్రస్తుతం తారక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.