JR NTR: ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబును అసెంబ్లీ వేదికగా వైసీపీ అవమానించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రెస్ మీట్లో నందమూరి కుటుంబాన్ని వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడరంటూ.. కన్నీరు పెట్టుకున్నారు చంద్రబాబు. దీంతో విషయం హాట్‌టాపిక్ అయ్యింది. అనంతరం అగ్రహీరో నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి మా కుటుంబంలోని ఆడవాళ్లను అవమానిస్తూ ఊరుకోం ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
కాగా, ఆ తర్వాత తారక్ కూడా ఈ విషయంపై స్పందించిన విషయం తెలిసిందే. అయితే, అప్పటి నుంచి ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ.. పలువురు వైసీపీ నేతలు విమర్షలు గుప్పించారు. కాగా, మరోవైపు, వైసీపీ నేత కొడాలి నానిపై స్పందిస్తూ.. ఎన్టీఆర్‌ను జోడిస్తూ వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
కొడాలి నానిని జూనియర్ ఎన్టీఆర్ కంట్రోల్ చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తారక్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ చేబితే వినాల్సిన అవసరం తనకు లేదని.. ఒకప్పుడు సినిమాల్లో కలిసి పనిచేసిన మాట వాస్తవమైనప్పటికీ.. ఆ తర్వాత విభేదాల కారణంగా దూరమయ్యాయమని వివరించారు.
మరి ఈ విషయంపై ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఈసినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న రెండో చిత్రం ఇది. గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.