Major: అడవి శేషు హీరోగా వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తోన్న సినిమా మేజర్. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మూడు భాషల్లో రూపొందించిన ఈ సినిమా.. 120 రోజుల పాటు షూటింగ్ జరిగింది. సుమారు 75 లొకేషన్లలో షూటింగ్ జరపగా.. అందులో 8 సెట్లు ప్రత్యేకంగా నిర్మించారు. 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అమరవీరుడైన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంపై ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజాగా, ఉన్నికృష్ణన్ త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఆయన తల్లిదండ్రుల సమక్షంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏటా ఈ రోజు సందీప్ ఉన్నికృష్ణన్ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. తాజ్‌మహల్ ప్యాలెస్‌ను సందర్శించడానికి ముంబయి వస్తుంటారు. ఈ క్రమంలోనే షూటింగ్ సమయంలో హీరో అడవి శేషుకు, మేజర్ సందీప్ కుటుంబానికి లోతైన బంధం ఏర్పడింది. సామాన్య ప్రజలకోసం తన ప్రాణాలను కోల్పోయిన భరతమాట ముద్దుబిడ్డను స్మరించుకుంటూ.. మేజర్‌కు నివాళులు అర్పించేందుకు తాజాగా, అడవిశేషు ముంబయి చేరుకున్నారు.
శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అడవి శేషు ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. హిందీ, తెలుగు, మలయాళంలో ప్రపంచవ్యాప్తంగా 2022 ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల కానుంది.
తన కెరీర్లో విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతుంటారు అడవి శేషు. ఈ సినిమాలో కూడా తన నటనతో శక్తినంతా ధారపోస్తున్నట్లు తెలుస్తోంది.