NTR in the list of Oscar: ప్రపంచ సినిమా వేదికపై ఆస్కార్ ని ముద్దాడటం ప్రతి నటుడి కల. అయితే ఇండియన్స్ కల్లో కూడా ఆస్కార్ వస్తుందని ఊహించరు. అలా అని భారతీయ చిత్రాలకు ఆ సత్తా లేదా అంటే ఉంది. ఆర్ట్ సినిమాలకు ఆస్కార్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇండియాలో ఆ తరహా చిత్రాలు తక్కువ మొత్తంలో తెరకెక్కుతున్నాయి.అకాడమీ అవార్డ్స్ జ్యూరీ మెంబర్స్ లో భారతీయ చిత్రాల పట్ల ఉండే వివక్ష కూడా ఒక కారణం. కే విశ్వనాథ్ తెరకెక్కించిన కళాఖండాలు ఆస్కార్ అర్హతకు మించినవి. ఇక వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో 5గురు మాత్రమే ఆస్కార్ ముద్దాడారు.

కాస్ట్యూమ్స్ డిజైనర్ భాను అథియా ఆస్కార్ అందుకున్న మొదటి ఇండియన్. 1982లో ఆమెను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అనంతరం బెంగాలీ ఫిలిం మేకర్ సత్య జిత్ రే కు 1992లో గౌరవ ఆస్కార్ ఇచ్చారు. తర్వాత ఏ ఆర్ రెహమాన్, గుల్జార్, రసూల్ పూకుట్టి స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి ఆస్కార్ అవార్డ్స్ గెలుపొందారు. 2009 తర్వాత మళ్ళీ ఇండియాకు ఆస్కార్ రాలేదు.

ఆర్ ఆర్ ఆర్ మూవీ సంచలన విజయం సాధించగా ఈ చిత్రానికి ఆ అర్హత ఉందని మేకర్స్ తో పాటు ఇండియన్ ఆడియన్స్ భావిస్తున్నారు. అయితే అధికారికంగా ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ జ్యూరీ సభ్యులు ఆర్ ఆర్ ఆర్ ని ఆస్కార్ నామినేషన్స్ కి పంపలేదు. అయినప్పటికీ లాస్ ఏంజెల్స్ లో రెండు వారాలకు పైగా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శించబడింది. ఆ విధంగా జనరల్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ కి అప్లై చేసుకునే అవకాశం దక్కింది.

ప్రస్తుతానికి ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ నామినేషన్స్ లో షార్ట్ లిస్ట్ అయ్యింది. జనవరి 12 నుండి 17 వరకు షార్ట్ లిస్ట్ లో ఉన్న చిత్రాలకు జ్యూరీ సభ్యులు ఓటింగ్ వేస్తారు. ఓటింగ్ ఆధారంగా నామినేట్ అయిన చిత్రాలు ప్రకటిస్తారు. అయితే ప్రముఖ మ్యాగజైన్ ది వెరైటీ ఆస్కార్ గెలుచుకునే అవకాశం ఉన్న నటుల జాబితా ప్రకటించింది. అందులో ఎన్టీఆర్ కి చోటు దక్కింది. విల్ స్మిత్, హూ జాక్ మన్ వంటి హాలీవుడ్ స్టార్స్ తో పాటు ఎన్టీఆర్ ది వెరైటీ మ్యాగజిన్ ఆస్కార్ ప్రిడిక్షన్స్ లిస్ట్ లో చోటు సంపాదించారు. ఇది అరుదైన గౌరవంగానే భావించాలి.