Homeలైఫ్ స్టైల్Hidden Facts of Sleeping Positions: మనం నిద్రపోయే భంగిమల్లో ఏ వ్యక్తిత్వాలు దాగి ఉన్నాయో...

Hidden Facts of Sleeping Positions: మనం నిద్రపోయే భంగిమల్లో ఏ వ్యక్తిత్వాలు దాగి ఉన్నాయో తెలుసా?

Hidden Facts of Sleeping Positions: మనకు నిద్ర అత్యవసరం. మనిషి జీవితంలో తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే. రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోతేనే మన ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆరోగ్యంగా ఉండటానికి మనం నిద్రను ఒక భాగంగా చేసుకోవడం మంచిదే. మనం నిద్రపోయే భంగిమల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిద్ర పోవడం ఎంతో ముఖ్యం. మనం నిద్రపోయే భంగిమ కూడా మన వ్యక్తిత్వాన్ని చెబుతుంది.

Hidden Facts of Sleeping Positions
Sleeping Positions

నిద్ర పోయేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా పడుకుంటారు. కొందరు బోర్లా పడుకుంటే మరికొందరు పక్కకు తిరిగి పడుకోవడం సహజం. ఇంకొందరు మాత్రం తల కింద చెయ్యి పెట్టుకుని పడుకుంటారు. ఇలా రకరకాల భంగిమల్లో పడుకునే అలవాటు ఉంటాయి. ఇంతకి మనిషి ఎటు వైపు తిరిగి పడుకోవాలో తెలుసుకుంటారు. నిద్ర భంగిమలు మన గురించి తెలియజేస్తుంది. అవి ఏంటో తెలుసుకుంటే మన భంగిమలు మన గురించి చెబుతాయనడంలో ఆశ్చర్యం లేదు.

Hidden Facts of Sleeping Positions
Sleeping Positions

మనలో చాలా మంది పక్కకు తిరిగి కాలు ముడుచుకుని పడుకుంటారు. వీరు కష్టపడి పని చేస్తారు. చిన్న విషయాలకి తెగ బాధపడుతుంటారు. ఇక కుడి చెయ్యి తల కింద పెట్టుకుని పడుకునే వారు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. పనుల్లో విజయాలే ఎక్కువగా సాధిస్తారు. భిన్నమైన దారిలో వెళ్లడానికి ఇష్టపడతారు. వీరికి అధికారం తోడుగా నిలుస్తుంది. సంపద కూడా అండగా ఉంటుంది. ఇలా మనం పడుకునే భంగిమలు మన గురించి తెలియజేస్తాయి. ఎక్కువ మంది పక్కకు తిరిగి పడుకోవడమే అలవాటుగా చేసుకుంటారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

ఎడమ చెయ్యి తల కింద పెట్టుకుని పడుకునే వారు మంచితనం కలిగిన వారై ఉంటారు. పెద్దలంటే గౌరవం ఉంటుంది. చేసే పనిలో నిబద్ధత ఉంటుంది. వీరిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. వీరుచేసే పనుల్లో క్రియేటివిటీ ఉంటుంది. కాళ్లు చేతులు బార్లా చాపి వెల్లకిలా పడుకుంటారు. నలుగురిలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు. రెండు చేతులు తలగడగా బోర్లా పడుకుంటే వారిలో సంకుచిత ప్రభావం ఉంటుంది. అవసరమైతే మాట కలిపే

Hidden Facts of Sleeping Positions
Sleeping Positions

మనస్తత్వం కలవారుగా ఉంటారు. ఎలాంటి లక్ష్యం లేకుండా జీవితాన్ని గడుపుతారు.

ఒకే పక్కకు తిరిగగి రెండు కాళ్లు ముడుచుకుని పడుకునే వారు స్వార్థం, అసూయ కలిగిన వారుగా ఉంటారు. పగ ప్రతీకారాలకు ప్రతీకగా నిలుస్తారు. వీరు త్వరగా మోసపోయే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మనం నిద్రపోయే భంగిమల్లో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయనే సంగతి అర్థమవుతుంది. ఇవి మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంది. ఆత్మవిశ్వాసాలను వెల్లడిస్తోన్నాయి.

Also Read: How To be happy in 2023: 2023లో సంతోషంగా గడపాలంటే ఏం చేయాలో తెలుసా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version