Waltheru Veeraiya: పాపం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కి షాక్ మీద షాక్ తగులుతోంది.. నిన్ననే వాళ్ల నిర్మాణ సంస్థ నుండి వస్తున్న ‘వీర సింహ రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేసారు.. ఒంగోలులో ఘనంగా జరగాల్సిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతించలేదు..

మళ్ళీ మైత్రీ మూవీ మేకర్స్ నుండి వస్తున్న మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా అనుమతిని నిరాకరిస్తునట్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ ఆర్కీ బీచ్ రోడ్డులో ఘనంగా జరపాలని నిర్మాతలు ప్లాన్ చేసారు..ఇందుకోసం ప్రత్యేకంగా రైళ్లు కూడా వేసి, కనీవినీ ఎరుగని రేంజ్ లో ఈ నెల 8వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దాం అనుకున్నారు.. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివర్లో పెద్ద షాక్ ఇచ్చేసింది.

ఇలా వరుసగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి అనుమతిని రద్దు చెయ్యడానికి కారణం చంద్ర బాబు నాయుడు అనే చెప్పాలి.. ఎందుకంటే ఇటీవలే ఆయన కందుకూరు లో నిర్వహించిన ఒక రోడ్డు షోలో తొక్కిసలాట జరిగి చాలామంది ప్రాణాలు పొయ్యాయి.. అప్పటి నుండి రోడ్ షోస్ మరియు పబ్లిక్ ఈవెంట్స్ ని నిషేధిస్తునట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అందువల్లే ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి బ్రేక్ పడినట్టు తెలుస్తోంది.. దీంతో ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్.. కానీ మెగా మరియు నందమూరి అభిమానులు మాత్రం చాలా తీవ్రస్థాయిలో నిరాశకి గురయ్యారు.. రాజకీయాల్లో ఇండస్ట్రీ చిక్కుకొని నలిగిపోతుందని బాధపడుతున్నారు.. మరి దీనిపై చిరంజీవి మరియు బాలయ్య ఎలా స్పందిస్తారో చూడాలి.