Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో అగ్ర హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నారు. నటనలో అయిన, డాన్స్ లో అయిన, తనకు తానే పోటీ అనేంతలా మెప్పించగలరు ఎన్టీఆర్. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలి ట్రిప్ లో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో కూడా ఛాక్కర్లు కొట్టడం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత తారక్ కొరటాల దర్శకత్వంలో ఒక సినిమాకి ఒకే చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి.

ఎన్టీఆర్, కొరటాల శివ ఎంత మంచి మిత్రులో అందరికీ తెలిసిందే. కొరటాల రచయితగా ఉన్నప్పటి నుంచి ఆయనకు తారక్‌తో మంచి అనుబంధం ఉంది. ‘బృందావనం’ సినిమాకు మాటలు రాసే అవకాశం ఇచ్చి కొరటాలను వెలుగులోకి తెచ్చాడు తారక్. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. దీంతో త్వరలో పట్టా;ఎక్కనున్న ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఆర్‌ఆర్‌ఆర్ తారక్ చేయబోయే చిత్రం కావడంతో కొరటాల గట్టిగానే ప్లాన్ చేసి ఉంటాడని నందమూరి అభిమానులు భావిస్తున్నారు.
అయితే ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ కి ఇకిన ఇంటర్వ్యూ లో తన తదుపరి సినిమాల గురించి వెల్లడించాడు. ఈ సంధర్భంగా కొరటాల చిత్రం గురించి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా 2022 ఫిబ్రవరిలో సెట్స్ మీదికి వెళ్లనందాని చెప్పారు. అలానే ఈ సినిమా ఒక రివెంజ్ డ్రామాగా రూపొందనుందని… ఆరేడు నెలల్లో సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఎన్టీఆర్ వెల్లడించాడు. మరోవైపు కొరటాల ‘ఆచార్య’ పని పూర్తి చేసి తారక్‌తో చేయబోయే సినిమా స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుకుంటున్నాడు. ప్రస్తుతం తారక్, రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన రిలిక్ కానుంది.