Dude Movie: ఈ దీపావళి కానుకగా విడుదలైన సినిమాల్లో యూత్ ఆడియన్స్ అమితంగా ఇష్టపడిన చిత్రం ‘డ్యూడ్'(Dude Movie). ‘డ్రాగన్’, ‘లవ్ టుడే’ వంటి వరుస భారీ బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత ప్రదీప్ రంగనాథన్(Pradeep Rangathan) నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై మొదటి నుండి అంచనాలు భారీగానే ఉండేవి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో కాస్త గాడి తప్పింది ఈ చిత్రం. కానీ ఒక సెక్షన్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా నచ్చడంతో కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రదీప్ రంగనాథన్ ని స్టార్ స్టేటస్ అంచుల వరకు తీసుకెళ్లింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే.
Also Read: రవితేజ ‘మాస్ జాతర’పై నీలినీడలు: మరో రొటీన్ సినిమానా? అందుకే ప్రమోషన్ పక్కన పెట్టారా?
అయితే మైత్రి సంస్థ ఈ సినిమాని ముందుగా ప్రదీప్ ని పెట్టి చెయ్యాలని అనుకోలేదు. అక్కినేని నాగచైతన్య తో చెయ్యాలని అనుకున్నారట. డైరెక్టర్ కీర్తిస్వరణ్ తో నాగ చైతన్య(Naga Chaitanya) కి ఒకసారి మీటింగ్ ని ఏర్పాటు చేసి ఈ సినిమా కథని వినిపించారట మేకర్స్. నాగ చైతన్య కి బాగా నచ్చింది, కానీ ఆయన కెరీర్ మొత్తం ఇదే తరహా సినిమాలతో నిండిపోయింది. పైగా తండేల్ నుండి పెద్ద సినిమాలు చెయ్యాలని ఆయన మైండ్ లో బలంగా ఫిక్స్ అయిపోయాడు. అందులో భాగంగానే ఆయన విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ తో ఒక మిస్టిక్ థ్రిల్లర్ జానర్ లో సినిమా చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఒక్కసారి పెద్ద సినిమాల వైపు చూసిన తర్వాత మళ్లీ వెనక్కి చూస్తే బాగుండదు అనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
ఇక ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ కి తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ ముందుకెళ్తున్న ప్రదీప్ రంగనాథన్ తో ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన రావడం, వెంటనే డైరెక్టర్ కీర్తి తో ఆయన మీటింగ్ ఏర్పాటు చేసి కథ ని వినిపించడం. అది ప్రదీప్ కి బాగా నచ్చి వెంటనే చేయడం వంటివి జరిగింది. ఇక ఆ తర్వాత ఫలితం ఏంటో మనమంతా చూస్తున్నాము. నాగ చైతన్య చేసుంటే ఈ సినిమా కి ఇదే తరహా ఫలితం వచ్చి ఉండేది. కానీ ఆయన పెట్టుకున్న టార్గెట్ ని చూస్తే మాత్రం అతని నిర్ణయం కరెక్ట్ అనే అనిపిస్తుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో నాగ చైతన్య ఎలాంటి సినిమాలతో మన ముందుకు రాబోతున్నాడు అనేది.