PM Modi: అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రధానమంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ. అంతేకాదు అమెరికా లాంటి దేశాలను సైతం సవాల్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. స్నేహాన్ని ఇతర దేశాలతో కొనసాగిస్తూనే.. అవసరమైన సందర్భాల్లో భారత సైనిక సత్తాను ఇతర దేశాలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. రక్షణ రంగంలో.. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో.. వైద్యరంగంలో అనేకమార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఒకరకంగా ఆధునిక భారత్ ను నిర్మిస్తున్నారు నరేంద్ర మోడీ. అమెరికా నుంచి మొదలు పెడితే ఆఫ్రికా వరకు భారతదేశంతో గతంలో ఉన్న దానికంటే గొప్పగా దౌత్య సంబంధాలను మెరుగుపరిచారు.
మన దేశం మీద విషం..
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. భారత్ మీద లేని విషాన్ని కక్కుతున్నారు. అనవసరమైన ఆంక్షలు విధిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలో భారత్ తన స్వీయ సాధికారతను సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే అన్ని దేశాలతో వ్యాపార భాగస్వామ్యాలను మెరుగుపరుచుకుంటున్నది. ఎగుమతుల విషయంలో స్పష్టమైన వైఖరిని అవలంబిస్తున్నది. ఇది సహజంగానే అమెరికాకు కంటగింపుగా మారింది. అందువల్లే అమెరికా లేనిపోని కుట్రలను భారత ప్రధాని మీద చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో చైనా లో షాంగై సదస్సుకు ప్రధానమంత్రి వెళితే.. ఓ గుర్తుతెలియని వ్యక్తి హత్యకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే దానిని రష్యా, చైనా వ్యూహాత్మకంగా తిప్పి కొట్టాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మోడీపై హత్యకు ప్రయత్నించిన ఆ వ్యక్తి బంగ్లాదేశ్లో అత్యంత అనుమానాస్పదంగా చనిపోయాడు. అతని వద్ద భారీగా నగదు లభ్యమైంది.
ఇలా వెలుగులోకి వచ్చింది..
వాస్తవానికి ఈ విషయాన్ని నరేంద్ర మోడీ నేరుగా చెప్పలేదు. ఈ విషయాన్ని బయట పెట్టడంలో ఆయన అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. సద్దాం హుస్సేన్ లేదా గడాఫీ లాగా అమెరికాపై విమర్శలు చేయలేదు. కేవలం పత్రికల ద్వారానే ఈ వార్తను లీక్ చేయించారు. హత్యాయత్నం జరిగిన మాట వాస్తవం. అయితే రష్యా ప్రయత్నం వల్ల ఇది ఆగిపోయిందని ప్రజలకు తెలిసే మాదిరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశారు.
గతంలో రెండుసార్లు..
మనదేశంలో 1966, 1984 తర్వాత ప్రధానమంత్రి పై జరిగిన మూడవ హత్యాయత్నం.. ఒకవేళ నరేంద్ర మోడీని చంపడం లేదా తొలగించేందుకు ప్రయత్నాలు గనుక జరిగితే.. దీనికి గనక ప్రతిపక్షం సహాయం చేస్తోందని కేంద్రం కనుక ప్రకటిస్తే.. ఆ తర్వాతి పరిణామాలు అత్యంత దారుణంగా ఉంటాయి. ఒకవేళ గనుక రాహుల్ గాంధీ బడాయి మాటలు మాట్లాడి.. నరేంద్ర మోడీపై దాడి జరిగితే.. ఆ సమయంలో రాహుల్ గాంధీ ద్వేషాన్ని గనక వ్యాప్తి చేస్తే.. అప్పుడు జరిగే పరిణామాల వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా ఇబ్బంది పడతారు..
ఇబ్బంది పడక తప్పదు
రాహుల్ గాంధీకి రక్షణ ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపి, ప్రజల ఆగ్రహానికి ఖచ్చితంగా గురవుతారు. ఇది కాంగ్రెస్ పార్టీని పెనం నుంచి పొయ్యిలోకి లాగే ప్రయత్నం లాంటిదే.. అయితే ఈ కుట్ర వెనుక రాహుల్ గాంధీ పేరు వినిపించడం లేదు. ఇటీవల అమెరికాకు రాహుల్ గాంధీ వెళ్లారు. ఆయన కొంతమంది వ్యక్తులను కలిశారు. అయితే ఆ వ్యక్తులను అక్కడి డీప్ స్టేట్ కూడా ఇష్టపడకపోవడం విశేషం. అమెరికాలో కూడా రాహుల్ గాంధీకి విశ్వసనీయత లేకపోవడం అత్యంత బాధాకరం. ఇక అమెరికా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రభుత్వాలను కూల్చింది. హమీద్ కర్జాయ్, మహమ్మద్ యూసఫ్ లాంటి వ్యక్తులను మాత్రమే గద్దెనెక్కించింది. దీనిని బట్టి అమెరికా ప్రణాళిక ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సమయమనం అవసరం..
పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన దేశ ప్రజలు ఇలాంటి ఉద్రిక్తతలో సమయమనం పాటించాలి. దేశంలో అరాచకం సృష్టించకుండా ఉండాలి.. ఇప్పుడు ఇక చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తన వ్యతిరేకుల మీద యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఏకంగా చంపడాన్ని కూడా ప్రారంభించాడు. తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత.. దానికి పాల్పడిన వ్యక్తి బంగ్లాదేశ్లో అత్యంత అవమానకరంగా చనిపోయాడు. ఈ ప్రకారం నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.
