https://oktelugu.com/

NTR Movie: ఎన్టీయార్ సినిమాను రీమేక్ చేయబోతున్న యంగ్ హీరో…ఎంకరేజ్ చేస్తున్న తారక్…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో యంగ్ హీరో గా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న హీరో విశ్వక్ సేన్ ఇక ఈయన కూడా వరుసగా మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

Written By: , Updated On : May 24, 2024 / 10:14 AM IST
Young hero to remake the NTR movie

Young hero to remake the NTR movie

Follow us on

NTR Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయన సాధించిన విజయాలే అతన్ని మనకు చాలా గొప్పగా పరిచయం చేస్తాయి. ఇక ఇదిలా ఉంటే ఈయన ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో యంగ్ హీరో గా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న హీరో విశ్వక్ సేన్ ఇక ఈయన కూడా వరుసగా మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక విశ్వాక్ సేన్ ఎన్టీఆర్ కి డై హార్ట్ ఫ్యాన్ అనే విషయం మనందరికీ తెలిసిందే..కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొన్ని క్లాసికల్ సినిమాలను విశ్వక్ సేన్ రీమేక్ చేయాలని చూస్తున్నారట.

ఇక మొత్తానికైతే ఎన్టీయార్ సూపర్ హిట్ సాధించిన సినిమాల్లో ఆది, సింహాద్రి, టెంపర్, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలు మంచి పేరును సంపాదించుకున్నాయి. మరి ఈ సినిమాల్లో ఆయన ఏ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నాడు అనే దాని పట్ల సరైన అవగాహన అయితే లేదు. కానీ మొత్తానికైతే తను ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారి అయిన ఎన్టీఆర్ సినిమాను రీమేక్ చేసి సక్సెస్ సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఎన్టీఆర్ కూడా విశ్వక్ సేన్ ను ఎంకరేజ్ చేయడానికి చాలావరకు ఆయన ఫంక్షన్స్ కి అటెండ్ అవుతూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే కొన్ని ఫంక్షన్స్ కి ఎన్టీఆర్ వచ్చి స్వయంగా ఆయన సినిమాని ప్రమోట్ చేయడంతో ఆ సినిమాకి ప్రమోషన్ పరంగా చాలా మంచి హైప్ అయితే క్రియేట్ అతిన సందర్భాలు ఉన్నాయి. ఇక విశ్వక్ సేన్ ఎన్టీఆర్ ల మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది. ఈ బాండింగ్ తోనే వాళ్ళు చాలా రోజుల నుంచి మంచి సన్నిహితంగా మెదులుతూ వస్తున్నారు….