Anchor Rashmi: స్టార్ హీరోల సినిమా వేడుక ఏదైనా సుమ దిగిపోతారు. సమయానుసారంగా పంచులు, ప్రాసలతో కూడిన హాస్యం కురిపిస్తూ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచుతారు. ఈ విషయంలో ఆమెకు తిరుగులేకుండా పోయింది.ప్రధాన భాషలపై పట్టు, సెన్సాఫ్ హ్యూమర్ ఆమెను మిగతా వారికంటే ప్రత్యేకంగా మార్చివేసింది.

తమ గ్లామర్ తో యాకరింగ్ ఇండస్ట్రీని ఏలాలని, సుమ స్థానం భర్తీ చేయాలని రష్మీ, అనసూయ, శ్రీముఖి వంటివారు తెగ ట్రై చేస్తున్నారు. కానీ ఆమె స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోతున్నారు. ఇక జనాలకు కూడా సుమ అలవాటైపోయారు. ఆమె స్థానంలో మరొకరిని ఊహించుకోలేకపోతున్నారు.
సుమ నుండి వాళ్లకు తీవ్ర పోటీ ఎదురవుతుంది. కాగా నిన్న రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ యాంకర్ రష్మీ గౌతమ్ దక్కించుకున్నారు. రాధే శ్యామ్ వేదికపై ఆమెను చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఈవెంట్ రష్మీ చేతిలో పెట్టారా..? అని షాక్ అయ్యారు. తెలుగమ్మాయి అయినప్పటికీ రష్మీకి తెలుగు అంతగా రాదు. ఆమె హిందీ హీరోయిన్ లా పట్టి పట్టి మాట్లాడతారు.
Also Read: మహేశ్ కుటుంబానికి పవన్ క్రిస్మస్ స్పెషల్ గ్రీటింగ్స్!
జబర్దస్త్ లో ఆమె చేసే యాంకరింగ్ కూడా ఏమీ ఉండదు. అయితే ఆ షోకి ఆమె గ్లామర్ ప్రధాన ఆకర్షణ. ఈ విషయం రాధే శ్యామ్ ఈవెంట్ వేదికపై మరోసారి రుజువైంది. నవీన్ పోలిశెట్టి ఎంట్రీ ఇచ్చే వరకు ఎలాగొలా మేనేజ్ చేసిన రష్మీ.. ఆయన రాకతో పూర్తిగా తేలిపోయారు. నవీన్ పోలిశెట్టి తన ఎనర్జీ అంతా ఉపయోగించి వేదికను స్వాధీనం చేసుకున్నారు. రష్మీకి అసలు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు.
దీంతో రష్మీకి ఏడవాలో నవ్వాలో కూడా తెలియని పరిస్థితి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగల నవీన్ యాంకర్ గా అల్లాడించారు. ఇక నవీన్ కారణంగా రష్మీ కెరీర్ దెబ్బైపోయింది. రాధే శ్యామ్ వేదిక ద్వారా వచ్చిన అవకాశం ఆమెకు ఉపయోగపడకుండా పోయింది. తనని తాను నిరూపించుకొని ఇలాంటి బడా ఈవెంట్స్ పట్టేయాలన్న రష్మీ ఆశలకు గండి పడింది. దీంతో నవీన్ తనకు తెలియకుండా రష్మీ కెరీర్ ని నాశనం చేశాడని అంటున్నారు.
Also Read: మొన్న సమంత నేడు బన్నీ.. హీరో సిద్ధార్థ్ కి వచ్చిన ఇబ్బందేంటి?