Mahesh- Pawan: వర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు టాలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే, మహేశ్‌బాబుకు కూడా భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. వరుస విజయాలతో ప్రస్తుతం అగ్రహీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా అయినా చూడాలని వారి అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. వీరిద్దరు ఎప్పుడైనా కలిసినా ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడం చాలా సార్లు చూశాం. ఏ పండగొచ్చినా పవన్ మహేశ్ కుటుంబానికి స్పెషల్ గిఫ్ట్‌లు, గ్రీటింగ్స్ పంపించడం తెలిసిందే.

తాజాగా, పవన్ కళ్యాణ్ క్రిస్మస్ పండగ సందర్భంగా మహేశ్‌కు స్పెషల్ గ్రీటింగ్స్ పంపించారు. ఈ విషయాన్ని మహేశ్ సతీమణి నమ్రత తన ఇన్స్టాగ్రామ్ వేదికగా స్టోరీలో పెట్టి.. పవన్‌కు ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ప్రస్తుతం మహేశ్ సర్కారు వారి పాట సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా, భీమ్లనాయక్ సినిమాతో పవన్ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. అదే సమయానికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి పెద్ద సినిమాలు కూడా వస్తుండటంతో.. రిక్వెస్ట్ మేరకు పవన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కాగా, ఫిబ్రవరి 29న పవన్ భీమ్లానాయక్ విడుదల కానుంది.
Also Read: మరో ఆఫర్ అందుకున్న భీమ్లానాయక్ హీరోయిన్
మరోవైపు హరిహర వీరమల్లు సినిమలోనూ నటిస్తున్నారు పవన్. ఇప్పటికే 50 శాతంపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం స్క్రిప్ట్ రీడింగ్‌లో ఉంది. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: ఏపీ ప్రభుత్వంపై హీరో సిద్ధార్థ్ సంచలన ట్వీట్