Homeఎంటర్టైన్మెంట్1997 Movie: యంగ్ హీరో నవీన్ చంద్ర నటిస్తున్న "1997" చిత్రం విడుదల తేదీ ఖరారు...

1997 Movie: యంగ్ హీరో నవీన్ చంద్ర నటిస్తున్న “1997” చిత్రం విడుదల తేదీ ఖరారు…

1997 Movie: అందాల రాక్షసి చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయ‌మై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో న‌వీన్ చంద్ర. ఈ యంగ్ హీరో ప్రస్తుతం డా.మోహన్ దర్శకత్వంలో 1997 అనే కిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నవీన్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కోటి, శ్రీకాంత్ అయ్యంగార్, డా.మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిజ సంఘటనలను ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. అయితే ఇప్పుడు మరో అప్డేట్ తో సిద్దమైంది మూవీ యూనిట్.

young hero naveen chandra 1997 movie release date fixed

తాజాగా ఈ సినిమా నవంబర్ 26వ తేదీన విడుదల అవుతున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతం అందిస్తుండటం విశేషం. ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఏమి బతుకు.. ఏమి బతుకు’కు మంచి స్పందన లభించింది. మంగ్లీ పాడిన ఈ సాంగ్ ప్రేక్షకుల మన్ననలను పొందుతుంది.

ఇటీవల కలర్ ఫోటో ఫేమ్ చాందీని చౌదరి తో కలిసి ‘సూపర్ ఓవర్’ అనే సినిమాలో నటించాడు నవీన్. ఆహా ఓటిటీ లో ఈ మూవీ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మన్ననలను పొందింది. క్రికెట్ బెట్టింగ్, హవాలా నేపథ్యంలో సాగిన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది. అలానే అర‌వింద్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక క్రైమ్ థ్రిల్ల‌ర్‌ లో నవీన్ నటిస్తున్నాడు. శ‌‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్‌ ప‌తాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి జవ్వాజి రామాంజ‌నేయులు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular