https://oktelugu.com/

Lakshya Movie: నాగశౌర్య “లక్ష్య “సినిమాకు యూ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్…

Lakshya Movie: సంతోష్‌ జాగర్లపూడి దర‍్శకత్వంలో హీరో నాగశౌర్య, అందాల బ్యూటీ కేతిక శర్మ జంటగా స్పోర్ట్స్ నేపథ్యంలో నటిస్తున్న చిత్రం “లక్ష్య”. వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో విల్లు నేపథ్యంలో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా ఇది నిలిచింది. ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 09:54 PM IST
    Follow us on

    Lakshya Movie: సంతోష్‌ జాగర్లపూడి దర‍్శకత్వంలో హీరో నాగశౌర్య, అందాల బ్యూటీ కేతిక శర్మ జంటగా స్పోర్ట్స్ నేపథ్యంలో నటిస్తున్న చిత్రం “లక్ష్య”. వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో విల్లు నేపథ్యంలో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా ఇది నిలిచింది. ఈ డిసెంబర్ 10న మూవీ థియేటర్ లో ప్రేక్షకులను అలరించనుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు చిత్రం బృందం. ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్టర్స్, వీడియోలు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

    Lakshya Movie

    Also Read: పరువుతో బన్నీ పోరాటం… అంత ఈజీ కాదు!

    ఇటీవలే ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా విజయం జరిగాయి. అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చిన విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం నాగశౌర్య పడిన కష్టం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఈ సినిమా తో నాగ శౌర్య సినిమా ప్రయాణం స్టార్ హీరోయిన్ కి వెళుతుందో లేదో చూడాలి మరి. ఈ చిత్రంలో జగపతి బాబు, సచిన్ ఖేదేఖర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి  కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    Also Read: యాక్సిడెంట్ చేసిన గృహలక్ష్మి సీరియల్ నటి లహరి…