Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి చాలా రోజులు దాటింది. కానీ ఆయన మరణాన్ని ఎవరు జీర్ణించుకో లేకపోతున్నారు. బహుశా ఆయన సేవా కార్యక్రమాలు ఆయన మంచితనం ఆయన గుర్తుకు చేసుకునేలా ఉన్నాయనే చెప్పాలి. ఇతర భాషల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంత అద్భుతమైన నటనతో, మంచితనంతో ఆయన అభిమానులను సొంతం చేసుకున్నారు. పునీత్ మరణించిన సమయంలో కర్ణాటకలో వీధిలో ఆయన చిత్రపటాలు పూలదండలతో దర్శనమివ్వడం చూసి ఓ నటుడిపై ఇంత అభిమానమా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాయి.
Also Read: నాగశౌర్య “లక్ష్య “సినిమాకు యూ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్…
తన తండ్రి రాజ్‌కుమార్ సమాధి పక్కనే పునీత్ పార్థివ దేహానికి అంత్యక్రియలు అయ్యాక కొన్ని రోజులు తర్వాత అభిమానుల సందర్శనకు అవకాశం కల్పించారు. ఆ రోజు నుండి ఈ రోజు సాయంత్రం వరకు విరామం లేకుండా అభిమానులు వస్తూనే ఉన్నారు. రోజూ వేలమంది పునీత్ సమాధిని సందర్శిస్తూనే ఉన్నారు. ఆదివారానికి పునీత్ చనిపోయి 38 రోజులు అయింది. కాగా ఆదివారం పునీత్ సమాధి సందర్శనకు జనం పోటెత్తారు. తిరుమల లాంటి పెద్ద ఆలయాల్లో దర్శనానికి క్యూ లైన్లలో నిలుచున్నట్లుగా… దాదాపు అరకిలోమీటరు దూరం జనాలు నిలబడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ ఒక్క రోజు దాదాపు 35 వేల మంది పునీత్ సమాధిని సందర్శించారట. పునీత్ చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా ఇంతమంది అతడి సమాధి సందర్శనకు వస్తున్నారంటే అతడి మీద వారి ప్రేమ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: విడాకుల అనంతరం మొదటిసారి తన మనసులో మాట చెప్పిన సమంత…