https://oktelugu.com/

Samantha: విడాకుల అనంతరం మొదటిసారి తన మనసులో మాట చెప్పిన సమంత…

Samantha: నాగ చైతన్యతో సమంత ఈ ప్రేమ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమతో మొదలైన వీరి పరిచయం వివాహ బంధంతో ఒక్కటై టాలీవుడ్ లో క్యూట్ కపుల్స్ నిలిచారు. ఈ జంట ఏ షో కి వచ్చిన అభిమానుల కన్నుల పండుగ ఉండదనే చెప్పాలి. కాని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది ఈ జంట వివాహబంధానికి స్వస్తి చెప్పారు. వీరిద్దరూ విడిపోవడం చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వార్తల్లో వచ్చిన విషయం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 09:47 PM IST
    Follow us on

    Samantha: నాగ చైతన్యతో సమంత ఈ ప్రేమ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమతో మొదలైన వీరి పరిచయం వివాహ బంధంతో ఒక్కటై టాలీవుడ్ లో క్యూట్ కపుల్స్ నిలిచారు. ఈ జంట ఏ షో కి వచ్చిన అభిమానుల కన్నుల పండుగ ఉండదనే చెప్పాలి. కాని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది ఈ జంట వివాహబంధానికి స్వస్తి చెప్పారు. వీరిద్దరూ విడిపోవడం చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వార్తల్లో వచ్చిన విషయం తెలిసిందే. యూట్యూబ్ లో కూడా సమంతపై తప్పుడు వీడియోలు ప్రసారం చేయగా దీనిపై సమంత ఫైర్ అయింది. అయితే సమంత మాత్రం రోజూ తన జీవితానికి సంబంధించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ లు సోషల్ మీడియాలో చర్చగా మారింది.

    samantha sensational comments about her life after divorce

    Also Read: చచ్చిపోతానేమో అనుకున్నా.. చైతన్య విడాకులపై సమంత సంచలన వ్యాఖ్యలు

    చైతూ సామ్ విడిపోయిన తర్వాత వరుస సినిమాలతో ఇద్దరు బిజీగా ఉన్నారు. సామ్ అయితే ఏకంగా హాలీవుడ్ సినిమాలోనే నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఫిల్మ్‌ఫేర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన జీవితం గురించి, చైతూతో విడిపోయిన విషయం గురించి పంచుకున్నారు. సామ్ మాట్లాడుతూ.. లైఫ్ లో మనకు చెడ్డ రోజులు వస్తాయి వాటిని మనం అర్ధం చేసుకొని దానికి అనుగుణంగా ముందుకు సాగాలి అలాగే విడిపోవడం అనేది నా సమస్య.  కాని నేను నా జీవితాన్ని గడపాలి అనుకున్నాను కాబట్టి ఆ సమస్యను అంగీకరించాను. అవి అన్ని మర్చిపోయి జీవితంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వాటన్నిటినీ ఎదిరించి నేను ఎంత బలంగా ఉన్నానో అని నేనే ఆశ్చర్యపోయాను. చైతూతో విడిపోయాక ఆ బాధలో నేను కృంగిపోయి చనిపోతానని అనుకున్నాను కాని నేను చాలా దృఢంగా ఉన్నాను. ఇంత దృడంగా ఉండగలనని అని నేనే అనుకోలేదు. విడాకుల అనంతరం మొదటిసారిగా సమంత మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    Also Read: జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. ఉపాసన ఎమోషనల్​ పోస్ట్​.. సమంత స్వీట్​ రియాక్షన్​