Anchor Suma: నా కోరిక  తీర్చాలని పబ్లిక్ గా అడిగిన యంగ్ హీరో… ఇరుకున పడ్డ యాంకర్ సుమ ఏం చేసిందో తెలుసా?

విడుదలకు సిద్దమైన సినిమాల ప్రమోషన్స్ కోసం హీరోలు, హీరోయిన్స్, దర్శక నిర్మాతలు విచ్చేస్తారు. వారితో సుమ గేమ్స్, సంభాషణలు నవ్వులుపూయిస్తూ ఉంటాయి.

Written By: S Reddy, Updated On : May 16, 2024 7:39 pm

young hero Kartikeya who asks Suma Kanakala to fulfill that wish

Follow us on

Anchor Suma: స్టార్ యాంకర్ సుమ కనకాల షోలు తగ్గించారు. ఆమె సెలెబ్స్ ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. సుమ అడ్డా పేరుతో ఒక్క షో మాత్రం చేస్తున్నారు. ఈ గేమ్ షోలో ప్రతివారం స్టార్స్ పాల్గొంటున్నారు. విడుదలకు సిద్దమైన సినిమాల ప్రమోషన్స్ కోసం హీరోలు, హీరోయిన్స్, దర్శక నిర్మాతలు విచ్చేస్తారు. వారితో సుమ గేమ్స్, సంభాషణలు నవ్వులుపూయిస్తూ ఉంటాయి. లేటెస్ట్ ఎపిసోడ్లో భజే వాయు వేగం మూవీ టీమ్ పాల్గొన్నారు.

హీరో కార్తికేయ, హీరోయిన్ ఐశ్వర్య మీనన్, దర్శకుడు, మరో నటుడు సుమ అడ్డాకు విచ్చేశారు. సుమ వాళ్లతో ఎంత కామెడీ చేయాలో అంతా చేశారు. ఐపీఎల్ అనగానే గుర్తుకు వచ్చే పదాలు ఏమిటో చెప్పాలని అడిగింది. కార్తికేయ చాలా వరకు కరెక్ట్ గా చెప్పాడు. అనంతరం యాంటీ మేకప్ ఫోర్స్ అంటూ… హీరోయిన్ ఐశ్వర్య మీనన్ మీద పంచ్ వేశాడు. మేకప్ ఆమె వేసుకోలేదు… మేకప్ ఆమెను వేసుకుంది, అని ఐశ్వర్య మీనన్ పై పంచ్ విసిరాడు.

కాగా ఓ గేమ్ లో భాగంగా అందరికీ జ్యూస్ ఇచ్చింది. ఈ జ్యూస్ హిమాలయాల్లోని మూలికలతో తయారు చేసింది, అందరూ తాగాలని సుమ అన్నారు. ఆ జ్యూస్ తాగితే ఏమవుతుందని కార్తికేయ సుమను అడిగారు. మీ మనసులో ఏమనుకుంటే అది జరుగుతుంది… అని సుమ అన్నారు. అయితే సుమ నా సినిమా ప్రొడ్యూస్ చేయాలని కార్తికేయ అన్నారు. కార్తికేయ మనసులో కోరిక విని సుమ షాక్ అయ్యింది. పనిలో పనిగా ఓ చిత్రానికి నిర్మాతగా సుమను బుక్ చేసే ప్రయత్నం చేశాడు.

ఇటీవల సుమ కుమారుడు రోషన్ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. బబుల్ గమ్ టైటిల్ తో తెరకెక్కిన ఆ చిత్రం పర్వాలేదు అనిపించుకుంది. కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. బబుల్ గమ్ చిత్రానికి సుమనే నిర్మాత అని సమాచారం. అందుకే తన సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయాలని కార్తికేయ ఆమెను అడిగారు. ఇక భజే వాయు వేగం చిత్ర విషయానికి వస్తే.. మే 31న విడుదల కానుంది.