లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న ఓ కుర్ర హీరోతో మొదటి హిట్ కొట్టాడు ఒక కుర్ర డైరెక్టర్. కానీ, ఆ సినిమా హిట్ కి నేనే కారణం అంటూ ఆ తర్వాత ఆ డైరెక్టర్ అండ్ ఆ హీరో మధ్య ఇగో సమస్య వచ్చింది. చివరకు వ్యవహారం చెడిపోయింది, ఇద్దరి మధ్య మాటలు కూడా లేవు. అయితే టాలీవుడ్ లో మొదటి హిట్ కొట్టిన డైరక్టర్ గా అతగాడికి ఓ మీడియం రేంజ్ హీరో పిలిచి ఛాన్స్ ఇచ్చాడు.
ఎలాగోలా అదృష్టం బాగుండి, ఆ కుర్ర డైరెక్టర్ రెండో సినిమాతో కూడా మంచి హిట్ కొట్టాడు. అలా చక్కగా రెండు రీజనబుల్ హిట్ లు అందుకున్నాడు కాబట్టి, మంచి అవకాశాలు వచ్చాయి. కానీ ఇక్కడే ఓ పొరపాటు జరిగింది. ఆ కుర్ర డైరెక్టర్ కి ఆశ ఎక్కువైంది. కరెక్ట్ గా అప్పుడే ఓ పెద్ద డైరక్టర్ నుండి ఫోన్ వచ్చింది. పవర్ స్టార్ నాకు సన్నిహితుడు కదా,
సో.. నీకు పవర్ స్టార్ తో సినిమా సెట్ చేస్తా అంటూ ఒక లైన్ చెప్పి కథ రాయమని ఆర్డర్స్ పాస్ చేశాడు. దాంతో ఈ కుర్ర డైరెక్టర్ నమ్మేశాడు. ఏడాదిన్నర పాటు కథ పై కూర్చున్నాడు. కట్ చేస్తే.. ఆ స్టార్ డైరెక్టర్ కి కథ నచ్చలేదు. పోనీ మార్పులు ఏమైనా చెబుతాడా అంటే అదీ లేదు. కథ బాగాలేదు అని సింపుల్ గా తేల్చి చెప్పేశాడు.
ఇక అంతే, పవర్ స్టార్ తో సినిమా లేనట్టే. అనవసరంగా టైమ్ వేస్ట్ అయిందని ఆ కుర్ర డైరెక్టర్ ఇప్పుడు బాగా ఫీల్ అవుతున్నాడు. పోనీ పవర్ స్టార్ కి కథ చెప్పించి ఉంటే.. ఒకవేళ పవర్ స్టార్ కి కూడా కథ నచ్చకపోయి ఉండి ఉంటే.. ఓకే.
కానీ కథ వినేసి ఇతనే బాగాలేదు అంటూ తనను పక్కన పెట్టడం ఇతగాడు అసలు జీర్ణయించుకోలేక పోతున్నాడు. తన సన్నిహితుల దగ్గర ఆ స్టార్ డైరెక్టర్ ను అడ్డమైన బూతులు తిడుతున్నాడు ఈ కుర్ర డైరెక్టర్.