విద్యార్థులు బీ రెడీ: ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం

దేశంలో కరోనా రెండో దశ తగ్గలేదని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. వైరస్ మొదటి, రెండో దశలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిశాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యమో పాలకుల వైఫల్యమో కానీ ప్రజలైతే ఫలితం అనుభవించారు. తమ ప్రాణాలే పణంగా పెట్టారు. మొదటి దశలో వృద్ధులు, రెండో దశలో యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదు. వైరస్ ధాటికి బెంబేలెత్తిపోయారు. ప్రస్తుత తరుణంలో కరోనా కాస్త తగ్గినా మూడో దశ ఉందని […]

Written By: Srinivas, Updated On : July 23, 2021 5:14 pm
Follow us on

దేశంలో కరోనా రెండో దశ తగ్గలేదని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. వైరస్ మొదటి, రెండో దశలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిశాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యమో పాలకుల వైఫల్యమో కానీ ప్రజలైతే ఫలితం అనుభవించారు. తమ ప్రాణాలే పణంగా పెట్టారు. మొదటి దశలో వృద్ధులు, రెండో దశలో యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదు. వైరస్ ధాటికి బెంబేలెత్తిపోయారు.

ప్రస్తుత తరుణంలో కరోనా కాస్త తగ్గినా మూడో దశ ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆగస్టు 16 నుంచి పాఠశాలల పున: ప్రారంభానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంది.

కరోనా ప్రభావం పొంచి ఉన్న సందర్భంలో కూడా జగన్ ప్రభుత్వం పాఠశాలల ప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకోవడంపై గందరగోళం నెలకొంది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం మూడో దశ ముప్పు పొంచి ఉందని చెబుతున్నా జగన్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. స్కూల్స్ రీ ఓపెన్ రోజునే నూతన విద్యావిధానంపై సమగ్రంగా వివరించనున్నారు.

విద్యార్థులకు విద్యాకానుక కిట్లను పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ విద్యాకానుక కిట్లపంపిణీపై సమీక్ష నిర్వహించి అదనంగా డిక్షనరీలు జత చేయాలని పేర్కొన్నారు. నాడు నేడు మొదటి విడత పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం అదేరోజు జాతికి అంకితం చేస్తారని చెప్పారు. నూతన విద్యావిధానంపై అపోహలు తొలగించి సమగ్ర విధానం అమలుచేయాలని సీఎం భావించారు.