Mogalirekulu Sagar: చక్రవాకం సీరియల్ తో బుల్లి తెరకు పరిచయం అయ్యాడు సాగర్. రెండో సీరియల్ మొగలిరేకులు లో హీరోగా ఛాన్స్ దక్కించుకున్నాడు. ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడు పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. అతని నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. మొగలిరేకులు సీరియల్ అతనికి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 2008 లో ప్రారంభం అయిన మొగలిరేకులు 2013 వరకు సక్సెస్ ఫుల్ గా సాగింది. ఇందులో ఆర్కే నాయుడు, మున్నాగా సాగర్ డ్యూయల్ రోల్ లో కనిపించాడు.
ఓ రేంజ్ లో క్రేజ్ దక్కించుకున్నాడు. అనూహ్యంగా మొగలిరేకులు అనంతరం సాగర్ సీరియల్స్ లో నటించలేదు. బుల్లితెరకు దూరం కావడంతో ఆయన ఫ్యాన్స్ చాలా నిరాశకు గురయ్యారు. కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో సాగర్ కనిపించాడు. ప్రభాస్ నటించిన మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. ఇక సాగర్ హీరోగా నటించిన మొదటి చిత్రం సిద్ధార్థ్.
లాక్ డౌన్ టైంలో ‘ షాదీ ముబారక్ ‘ టైటిల్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేశాడు. ఈ మూవీతో హిట్ అందుకున్నాడు.త్వరలో ‘ ది 100 ‘ మూవీ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాగర్ పలు కీలక విషయాలు వెల్లడించాడు . సీరియల్స్ మానేయడానికి అసలు కారణం బటయపెట్టాడు.
సాగర్ మాట్లాడుతూ .. మొగలిరేకులు సీరియల్ లో ఆర్కే నాయుడు పాత్ర బాగా క్లిక్ అయింది. అందరికీ ఆ సీరియల్ బాగా నచ్చింది. సీరియల్స్ అంటేనే ఫిమేల్ సెంట్రిక్ గా సాగుతాయి. కానీ మొగలిరేకులు కథ నా చుట్టూ తిరిగింది. ఆ పాత్రకు ఉన్న రేంజ్ వేరు. ఆ తర్వాత సీరియల్స్ చేస్తే అదే రేంజ్ లో సక్సెస్ అయ్యే పాత్రలు చేయాలి అనుకున్నాను. మొగలిరేకులు తర్వాత చాలా సీరియల్స్ లో ఆఫర్స్ వచ్చాయి. కానీ నాకు పేరు తెచ్చిన ఆర్కే నాయుడు పాత్రను మించి ఏ పాత్ర రాలేదు. అందుకే సీరియల్స్ చేయలేదు అని సాగర్ క్లారిటీ ఇచ్చాడు. కాగా ది 100 చిత్రంలో మళ్ళీ పోలీస్ ఆఫీసర్ గా సాగర్ మెప్పించనున్నాడు. ఈ చిత్ర టీజర్ చిరంజీవి అమ్మగారైన అంజనాదేవి విడుదల చేయడం విశేషం.