Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. దాదాపు ఆయన 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్నాడు అంటే ఆయన క్రేజ్ ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంక తన తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ (Ram Charan) సైతం ప్రస్తుతం ‘గ్లోబల్ స్టార్’ గా అవతరించడమే కాకుండా ఆయనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి అంటూ అతని అభిమానులు సైతం రామ్ చరణ్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ (Game Changer) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో అందరూ నిరాశ చెందారు. కానీ బుచ్చిబాబు(Buchhi Babu) డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా మాత్రం భారీ విజయాన్ని సాధిస్తుందని ధృడ సంకల్పంతో మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…
ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఆస్తుల విలువ ఎంత అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లైతే వైరల్ అవుతున్నాయి. నిజానికి రామ్ చరణ్ ఒక సినిమాకి దాదాపు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటున్నాడు. ఇక ఆయనకు స్వతహాగా బిజినెస్ లు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 5000 కోట్ల వరకు ఉంటుందనే అంచనాలైతే ఉన్నాయి.
ఇక కాస్ట్లీ కార్లు అలాగే హైదరాబాదులోనే ఆయనకు మూడు నాలుగు ఖరీదైన ఇండ్లు కూడా ఉన్నాయనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక మొత్తం కలిసి 5000 కోట్ల వరకు తన ఆస్తి విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఆయనలాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సేవలను అందిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ముఖ్యంగా రామ్ చరణ్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఆయనకి యాక్టింగ్ రాదు అంటూ హేళన చేశారు.
కానీ ప్రతి ఒక్కరికి సమాధానం చెబుతూ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ‘రంగస్థలం’ (Rangasthalam) సినిమాతో యాక్టింగ్ లో పరిణితిని యావత్ ప్రేక్షకులందరికి చూపించడమే కాకుండా తనను విమర్శించిన వాళ్ళు సైతం ప్రశంసించేలా నటించి మెప్పించాడు… మొత్తానికైతే ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన క్యారెక్టర్ లో నటించడానికి చాలా వరకు ఆసక్తి అయితే చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. అందువల్లే ఆయన చేస్తున్న ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడంలో ముందు వరుసలో ఉన్నాయి…
One attachment
•