Corpses : ప్రతి ఒక్క దేశంలో కొన్ని వింత వింత పోకడలు జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. కొన్ని సార్లు వారికి అది కామన్ గా అనిపించినా ఇతరులకు మాత్రం భలే వింతగా అనిపిస్తుంది. ఇక కొన్ని ఉద్యోగాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరింత వింత ఉద్యోగాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం అలాంటి ఓ వింత ఉద్యోగం గురించి తెలుసుకుందాం. దీని గురించి తెలుసుకుంటే కచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ అదేంటి అంటే?
చైనా ఏది చేసినా వెరైటీగానే ఉండేలా చేస్తుంటుంది. జనాల దృష్టిని తమ వైపుకు తిప్పుకోవడానికి వింత వింత ప్రయోగాలు చేయడంలో ముందు ఉంటుంది. అయితే రీసెంట్ గా ఈ దేశం వెల్లడించిన ఓ కొత్త ఉద్యోగం గురించి విని చాలా మంది షాక్ అవుతున్నారు. అరె ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా అంటూ నోరెల్ల బెడుతున్నారు. ప్రస్తుత ఈ న్యూస్ కాస్తా నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. ఇక ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు దొరకడం చాలా కష్టమైన పనిగా మారింది. ఉద్యోగాల కోసం ఎంతో మంది చాలా ఆసక్తిగా, కష్టంగా ఎదురుచూస్తున్నారు.
కానీ చైనాలో మాత్రం ఓ కొత్త ఉద్యోగం వచ్చింది. ఈ కొత్త రకం ఉద్యోగాన్ని చైనా విడుదల చేసింది. దీన్ని చదివి జనాలు షాక్ అవకుండా ఉండలేకపోతున్నారు. ఇదేం పరీక్షరా బాబూ అంటున్నారు. మరి ఈ ట్రెండింగ్ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా?
చైనాలోని ప్రావిన్స్ ప్రాంతంలో ఈ ఉద్యోగం ఉంది. అయితే ఓ మార్చురీలో ఉద్యోగానికి ఇటీవల ఓ యాడ్ రిలీజ్ చేశారు. ఈ జాబ్ మార్చురీలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వరకూ బాగానే ఉంది. అయితే మార్చురీలో జాబ్ చేయాలంటే అనేక టెస్టులు కూడా ఉంటాయి. ఆ టెస్టుల్లో ఒకటి ముఖ్యంగా గడ్డ కట్టే చలిలో శవాలతో పాటు పది నిమిషాలు ఉండాలి. వామ్మో గడ్డ కట్టే చలిలో శవాలతో ఉండటం అంతే అంత సులభమా? మంచు ముక్కను చేతి మీద పెట్టుకోవడమే పెద్ద కష్టం. అలాంటిది పది నిమిషాలు అది కూడా శవాల పక్కన అనుకుంటున్నారు కొందరు. అంతేకాదు అసలు చిరాకు, విసుగు కూడా పడకూడదు. అంతే కాకుండా ఆరె నెలల పాటు అప్రెంటిస్‌షిప్ చేయాలి. 45 సంవత్సరాల వయసు ఉంటే మాత్రమే ఈ ఉద్యోగం చేయాలి. కొన్ని సార్లు 24 గంటల పాటు డ్యూటీ కూడా చేయాల్సి వస్తుంది. ఇక నెలకు రూ.25 వేల జీతం ఉంటుంది. ఈ ఆరు నెలల్లో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. అప్పుడు మాత్రం జాబ్ గ్యారెంటీ ఉన్నట్టు.
ప్రస్తుతం ఈ యాడ్ చూసిన జనాలు ఒకింత షాక్ అవుతున్నారు.. మార్చురీలో జాబ్ చేయాలంటే ఇన్ని కఠిన పరీక్షలా అంటున్నారు. మరీ అంత తక్కువ జీతానికి అంత ఎక్కువ శ్రమ పడాలా? అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో చైనా ట్రెండ్ అవుతూనే ట్రోల్ కు గురి అవుతుంది.