https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ అరెస్టుని రాజకీయం కోసం వాడుకుంటున్న వైసీపీ..క్రెడిట్స్ కోసం పాకులాట!

ఎంత ప్రత్యర్థులైనా కొన్ని రాజకీయ పార్టీలు పలు సంఘటనలు జరిగినప్పుడు విలువలు పాటిస్తాయి.

Written By:
  • Vicky
  • , Updated On : December 14, 2024 / 04:26 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun : ఎంత ప్రత్యర్థులైనా కొన్ని రాజకీయ పార్టీలు పలు సంఘటనలు జరిగినప్పుడు విలువలు పాటిస్తాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ వ్యవహరించే తీరుని చూస్తే, అసలు ఇలాంటోళ్ళకి ఓట్లు వేసి జనాలు అప్పట్లో ఎలా గెలిపించారురా బాబు అని అనిపించక తప్పదు. కేవలం పార్టీ నాయకులు మాత్రమే అలా ప్రవర్తిస్తున్నారు అనుకుంటే పొరపాటే, ఆ పార్టీ కార్యకర్తలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు శవాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని అల్లు అర్జున్ ని తమ నీచపు రాజకీయాల కోసం వాడుకొని లబ్ది పొందాలనే ఆలోచనలు చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చూసి విసుగెత్తిపోయే జనాలు ఆ పార్టీ కి 150 నుండి 11 స్థానాలకు పడిపోయేలా చేసారు. తప్పులను తెలుసుకొని, తీరుని మార్చుకొని బాగుపడతారని ఆడించిన వాళ్లకు కూడా ఆ పార్టీ పై విరక్తి కలిగేసింది.

    సంధ్య థియేటర్లో ‘పుష్ప 2’ ప్రీమియర్ షో కి అల్లు అర్జున్ వెళ్లడం వల్ల దురదృష్టం కొద్ది అక్కడ తొక్కిసిలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేస్తూ రేవతి కుటుంబానికి అండగా నిల్చి పాతిక లక్షల రూపాయిల డబ్బులను కూడా అందించాడు. కానీ పోలీసుల ప్రోటోకాల్స్ ని ఉల్లంఘించినందుకు అల్లు అర్జున్ ని నిన్న అరెస్ట్ చెయ్యాల్సి వచ్చింది. నేడు ఆయన బెయిల్ మీద బయటకి వచ్చాడు. అంతా బాగానే ఉంది. కానీ వైసీపీ పార్టీ ఇదంతా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి చేయించారు అంటూ సోషల్ మీడియా లో ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించింది తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు కి సంబంధం ఏముంది?, ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారో అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    చంద్రబాబు నాయుడు కి సీఎం రేవంత్ రెడ్డి శిష్యుడు కాబట్టి, అతనే చెప్పి అరెస్ట్ చేయించాడని ఒక ఫేక్ న్యారేటివ్ ని రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఒకవేళ వాళ్లకు నిజంగానే అల్లు అర్జున్ మీద అంత కక్ష్య ఉంటే, పుష్ప 2 చిత్రానికి కోరినంత టికెట్ రేట్స్, బెన్ఫిట్ షోస్ ఎందుకు ఇస్తారు?, ఆ సినిమాకి భారీ వసూళ్లు రావడానికి కారణం ఎందుకు అవుతారు అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు లకు అలాంటి మనస్తత్వమే ఉంటే, వాళ్ళిద్దరిని అత్యంత నీచంగా కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురళి, కోడలి నాని వంటి వారు ఇంకా ఎందుకు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు?, వాళ్లనే ఏమి చెయ్యకుండా వదిలేసినా పవన్ కళ్యాణ్ సొంత కుటుంబ సభ్యుడిని అరెస్ట్ చెయ్యిస్తాడా?, ఇంకెంత కాలం ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    మరో ఫేక్ ప్రచారం ఏమిటంటే అల్లు అర్జున్ తరుపున న్యాయవాది నిరంజన్ రెడ్డి జగన్ కి గతంలో బెయిల్ ఇప్పించాడని. కాబట్టి జగనే నిరంజన్ రెడ్డి ని అల్లు అర్జున్ కోసం పంపి బెయిల్ ఇప్పించినట్టుగా సోషల్ మీడియాలో రుద్దేస్తున్నారు. నిరంజన్ రెడ్డి కి దశాబ్దాల నుండి అల్లు, మెగా ఫ్యామిలీ లతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. వాళ్ళతో కలిసి ఆయన ఎన్నో సినిమాలు చేసాడు. చిరంజీవి కి ఒక కుటుంబ సభ్యుడిలాగా మారిపోయిన వ్యక్తి నిరంజన్ రెడ్డి అనే విషయం ఇండస్ట్రీ లో ఉన్నోళ్లకు తెలుసు. అయినప్పటికీ కూడా వైసీపీ శ్రేణులు అసత్య ప్రచారాలను రుద్దడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికైనా మారకపోతే భవిష్యత్తులో ఒక్క సీట్ రావడం కూడా కష్టమే అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.