మౌని రాయ్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన మంచి టాలెంట్ ఉన్న నటి. ఆమె కళాత్మక ప్రయాణాన్ని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు.
ఆమె తల్లి ముక్తి థియేటర్ ఆర్టిస్ట్. ఆమె తండ్రి అనిల్ రాయ్ కూచ్ బెహార్ జిల్లా పరిషత్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేశారు.
మౌని కూచ్ బెహార్‌లోని బాబర్హట్లోని కేంద్రీయ విద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేసింది.
తరువాత, ఆమె ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో మాస్ కమ్యూనికేషన్‌ను అభ్యసించింది.
బ్రహ్మాస్త్రం సినిమాలో నటించింది ఈ నటి. ఇందులో మౌని పాత్రకు మంచి ప్రశంసలు పడ్డాయి.
ఈ సినిమాల రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున వంటి ప్రముఖులు నటించారు.
ఆమె అభిమానులు మాత్రమే కాదు విమర్శకులు కూడా ఈమె నటనకు ఫిదా అయ్యారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. దీంతో మౌనీ రేంజ్ పెరిగిందనే చెప్పాలి.
ఇక మౌని రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా ఫోటోలు, అప్డేట్లను పంచుకుంటుంది. ఈ పోస్ట్‌లు ఆమె అభిమానులతో కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. ఇక ఈమెకు ఫాలో వర్లు కూడా అదే రేంజ్ లో ఉన్నారు.