Bigg Boss Telugu 8 : 15 వారాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ సీజన్ 8 రేపటితో ముగియబోతుంది. రేపు స్టార్ మా ఛానల్ లో ప్రసారం కాబోతున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కాసేపటి క్రితమే మొదలైంది. టైటిల్ విన్నింగ్ రేస్ నిఖిల్, గౌతమ్ కి మధ్య ఉండబోతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా పోల్స్ లో ఎక్కడ చూసినా వీళ్లిద్దరి మేనియానే కనిపిస్తుంది. అధికారిక పోల్స్ లో కూడా ఇద్దరి మధ్య పెద్దగా గ్యాప్ లేదు. ఎవరైనా విన్నర్ అవ్వొచ్చు. నిన్న ఉదయం సమయానికి గౌతమ్ నిఖిల్ పై స్వల్ప ఆధిక్యతతో లీడింగ్ లో ఉన్నాడని సోషల్ మీడియా లో ఒక న్యూస్ వచ్చింది. ఇది ఎంత మాత్రం నిజమో తెలియదు కానీ మాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇద్దరి మధ్య చాలా గట్టి పోటీ నడుస్తుందని తెలిసింది.
ఇదంతా పక్కన పెడితే నేడు జరిగే షూటింగ్ లో టాప్ 5 నుండి ముగ్గురు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఓటింగ్ ప్రకారం అవినాష్ అందరికంటే చివరి స్థానంలో ఉన్నాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ బిగ్ బాస్ టీం ఆయన్ని టాప్ 4 లోకి పంపి 10 లక్షల రూపాయిల సూట్ కేసు ని అందించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఎంత వరకు నిజమో కాసేపట్లో తెలియనుంది. అదే విధంగా టాప్ 3 లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ కి 15 నుండి 20 లక్షల రూపాయిల సూట్ కేసు ని ఆఫర్ చేసే అవకాశం ఉందట. దీనిని ప్రేరణ తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే హౌస్ లో ఉన్న 5 మందికి టాప్ 2 ఎవరో లోపలకు వచ్చిన అతిథుల ద్వారా తెలిసిపోయింది. అర్జున్ కళ్యాణ్ అయితే నబీల్ కి నేరుగా చెప్పేసాడు కూడా.
నబీల్ కి ఆ అవకాశం వస్తే తీసుకుంటాడో లేదో తెలియదు కానీ, అవినాష్, ప్రేరణ చాలా స్మార్ట్ ప్లేయర్స్ కాబట్టి వీళ్ళు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ ఫినాలే కి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు అంటూ సోషల్ మీడియా లో అనేక ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది. ఈ సీజన్ లో అల్లరి నరేష్, నితిన్, శ్రీలీల వంటి వారు వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్ప, టాప్ స్టార్స్ వచ్చే అవకాశమే లేదని స్పష్టమైంది. కానీ అతిథులు అయితే కచ్చితంగా వస్తారు, కానీ వాళ్ళు పాన్ ఇండియా రేంజ్ ఉన్న వాళ్ళైతే కాదు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ ముగిసిన వెంటనే జనవరి నెలలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా నాగార్జున ఫినాలే లో ఇచ్చే అవకాశం ఉందట.