Yatra 2 : యాత్ర 2 రిలీజ్.. ఏపీలో పెద్ద ప్లానే చేశారే?

ఈ సినిమాని ఎలక్షన్స్ కి ముందు రిలీజ్ చేస్తున్నారు అంటూ ప్రతి పక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి...చూడాలి మరి యాత్ర సినిమాలానే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధిస్తుందో లేదో...

Written By: Gopi, Updated On : February 7, 2024 11:02 pm

Yatra 2 Trailer

Follow us on

Yatra 2 : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రియల్ ఇన్సిడెంట్ల తో తెరకెక్కిన సినిమాలకు గాని, బయోగ్రఫీ సినిమాలకి గాని,సీక్వెల్ సినిమాలకి గాని మంచి ఆదరణ నెలకొంది. ఇక అందులో భాగంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరు సంవత్సరాల పాటు సీఎంగా కొనసాగిన దివంగత నేత శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది.

ఒక రకంగా వైసిపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడడానికి ఈ సినిమానే ఎక్కువ ఇంపాక్ట్ చూపించిందని చెప్పాలి. ఇక ఇప్పుడు దానికి ఈక్వేల్ గా యాత్ర 2 అనే సినిమా వస్తుంది.వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ను ఎలాగైతే సక్సెస్ ఫుల్ గా కొనసాగించారో దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు.

ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. ఇక దానికి సంబంధించి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్లో 9 గంటలకు ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఇక దాంట్లో భాగంగానే ఈ సినిమాకి గవర్నమెంట్ కూడా ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి భారీ కసరత్తులను చేస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమాని చూడాలని దాదాపు ప్రభుత్వం నుంచి ప్రమోషన్స్ కూడా కొనసాగుతున్నాయి.

ఇక యాత్ర 2 క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చూస్తుంటే రేపు జనాలు భారీగా ఈ ఈవెంట్ కి హాజరై దీన్ని సక్సెస్ చేస్తారనే వార్తలైతే వస్తున్నాయి…ఇక ఇది ఇలా ఉంటే జనాలను సింపతీ తో ఆకట్టుకోవడానికే ఈ సినిమాని ఎలక్షన్స్ కి ముందు రిలీజ్ చేస్తున్నారు అంటూ ప్రతి పక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి…చూడాలి మరి యాత్ర సినిమాలానే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధిస్తుందో లేదో…