Hero Yash : కన్నడ చలన చిత్ర పరిశ్రమలో టాప్ 2 హీరోల లిస్ట్ తీస్తే అందులో రాకింగ్ స్టార్ యాష్(Rocking Star Yash) పేరు కచ్చితంగా ఉంటుంది. KGF ముందు వరకు ఆయన కేవలం కన్నడ సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం. ఈ సినిమాకు ముందు కూడా ఆయనకు ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి, ఒక ఇండస్ట్రీ హిట్ కూడా ఉంది. ఇక KGF తర్వాత ఆయన తన స్థాయిని పెంచుకోవడమే కాకుండా, కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని కూడా తారాస్థాయికి తీసుకెళ్లాడు. ఆ ఇండస్ట్రీ ని పాన్ ఇండియన్ మార్కెట్ లో నిలబెట్టి తన సత్తా చాటిన యాష్ ప్రస్తుతం టాక్సిక్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పాటు ఆయన హిందీ రామాయణం లో రావణాసురిడి క్యారక్టర్ చేస్తున్నాడు. ఇది కాసేపు పక్కన పెడితే యాష్ తల్లి పుష్ప కూడా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది.
Also Read : అసిస్టెంట్ ఇంటికి వెళ్లి మరీ ఆ పని చేసిన హీరో యశ్.. అంతా అవాక్కు
అయితే నటిగా మాత్రం కాదు, నిర్మాతగా. ఆ నిర్మాతగా మారి రీసెంట్ గానే ‘కొత్తలవాడి’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అనంతరం ఆమె మీడియా తో ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఒక రిపోర్టర్ ఆమెని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ కొడుకు ఇప్పుడు ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు. ఆయనని హీరో గా పెట్టి భవిష్యత్తులో సినిమా తీస్తారా?’ అని అడిగిన ప్రశ్నకు పుష్ప సమాధానం చెప్తూ ‘అసలు తియ్యను..వాడు ఇప్పటికే పెద్ద స్టార్. వాడి దగ్గర బోలెడంత డబ్బులున్నాయి. వాడితో సినిమా తీయాల్సిన అవసరం ఏముంది. అన్నం ఉన్న వాడికి అన్నం పెడితే దాని విలువ తెలియదు. కొత్త టాలెంట్ ని ప్రోత్సహించి పైకి తీసుకొని రావడమే నా ద్యేయం’ అంటూ చెప్పుకొచ్చింది యాష్ తల్లి పుష్ప.
ఇది కాసేపు పక్కన పెడితే KGF చాప్టర్ 2 చిత్రం విడుదలై దాదాపుగా మూడేళ్లు కావొస్తుంది. కానీ యాష్ నుండి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. దీనిపై ఆయన అభిమానులు తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న ‘టాక్సిక్'(Toxic Movie) చిత్రం వచ్చే ఏడాది మార్చి 16 న విడుదల కాబోతుంది. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా కియారా అద్వానీ, నయనతార నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుంది. ఇక ఆయన నటిస్తున్న రామాయణం చిత్రం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. మూడేళ్ళ అభిమానుల ఆకలి ని యాష్ వచ్చే ఏడాది వరుసగా రెండు భారీ సినిమాలతో తీర్చబోతున్నాడు అన్నమాట. ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియన్ హీరోలతో పోలిస్తే యాష్ బాగా వెనుకబడ్డాడు, కాబట్టి అభిమానులు వచ్చే ఏడాది నుండి ఆయన్ని రెగ్యులర్ గా సినిమాలు చేయాల్సిందిగా కోరుతున్నారు.
Also Read : ఖరీదైన కారును కొనుగోలు చేసిన KGF హీరో యాష్. దాని ధరతో ఒక సినిమానే తీసేయొచ్చు తెలుసా!