Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్ సాధారణంగానే దూకుడుగా ఆడతాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేస్తాడు. అటువంటి ఆటగాడు ఫామ్ లో ఉంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంతిని బలంగా కొట్టడమే కాకుండా.. నలు దిశలలో ప్రయాణింప చేస్తాడు. అందుకే ఈ ఐపీఎల్లో అతడు వీరోచితమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. ముంబై జట్టు సాధించిన విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఓపెనర్లు విఫలమైన చోట.. మిగతా ఆటగాళ్లు చేతులెత్తేసినచోట.. సూర్య కుమార్ యాదవ్ బీభత్సం సృష్టిస్తున్నాడు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. విసమెత్తు భయం అనేది లేకుండా దుందుడుకుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. చివరికి ఢిల్లీ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్లో ముంబై విజయం సాధించడంలో సూర్య కుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. పటిష్టమైన ఢిల్లీ బౌలింగ్ లైన్ అప్ ను బెంబేలెత్తించాడు. స్పిన్, పేస్.. అని తేడా లేకుండా పరుగుల వరద పారించాడు. కీలకమైన ఇన్నింగ్స్ మాత్రమే కాదు.. ముంబై జట్టుకు అత్యంత కీలకమైన పరుగులు రాబట్టాడు. అందువల్లే ముంబై జట్టు ఢిల్లీ ఎదుట ఫైటింగ్ స్కోర్ ఉంచింది. దానిని ఢిల్లీ జట్టు చేదించడంలో విఫలమైంది.
Also Read: గ్రూప్ సమరం ముగిసినట్టే.. తుది రేసులో నిలిచిన జట్లు ఇవే.. పోటీ ఎలా ఉండబోతుంది అంటే?
సరికొత్త రికార్డు
ఒక ముంబై ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా 13 ఇన్నింగ్స్ 25 పైకి పైగా పరుగులు చేసిన సరికొత్త ప్లేయర్గా అవతరించాడు. అంతేకాదు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు టెంపా బావుమా రికార్డును సూర్య కుమార్ యాదవ్ ఈక్వల్ చేశాడు. ఇక ఈ సీజన్లో సూర్య కుమార్ యాదవ్ ఇప్పటివరకు 583 రన్ స్కోరు చేశాడు. ఆరెంజ్ క్యాప్ విభాగంలో థర్డ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా బుధవారం ఢిల్లీతో తలపడి ముంబై చెట్టు తరపున 43 బాల్స్ లో 73 రన్స్ స్కోర్ చేశాడు. ఒకానొక దశలో ఢిల్లీ బౌలర్ల ధాటికి ముంబై జట్టు ఇబ్బంది పడింది. కీలకమైన ప్లేయర్లు మొత్తం పెవిలియన్ చేరుకున్నారు. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్ మూల స్తంభం లాగా నిలబడ్డాడు. ఏమాత్రం భయపడకుండా.. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. చివరికి 73 రన్స్ స్కోర్ చేసి ముంబై జట్టుకు తిరుగులేని ఆధిపత్యాన్ని అందించాడు. ముంబై జట్టు చేసిన స్కోర్ ను డిపెండ్ చేయడంలో ఢిల్లీ విఫలమైంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఢిల్లీ తీవ్రంగా ఇబ్బంది పడింది. చివరికి అభిమానులు అనుకున్నట్టుగానే ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఢిల్లీ జట్టు గ్రూప్ దశ నుంచి నిష్క్రమించగా.. బై జట్టు ఎలాంటి సమీకరణంతో సమాధానం లేకుండా ప్లే ఆఫ్ వెళ్లిపోయింది..
వాస్తవానికి ఐపీఎల్ ప్రారంభానికి ముందు సూర్య కుమార్ యాదవ్ ఫామ్ లేని తో ఇబ్బందిపడ్డాడు. టి20 సిరీస్ లలో అంతగా పరుగులు చేయలేకపోయాడు. దీంతో అతడిని టి20 భారత జట్టుకు కెప్టెన్గా ఎందుకు ఉంచుతున్నారని ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఆ ప్రశ్నల నుంచి తనకు తాను సమాధానం వెతుకుతున్నాడు. చివరికి అద్భుతమైన ఫామ్ తో ఇలా ముంబై తిరుగులేని విజయాలు అందిస్తున్నాడు. ఒకవేళ సూర్యకుమార్ గనుక ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే.. టీమిండియా మరోసారి t20 ప్రపంచ కప్ సాధిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Suryakumar Yadav in each IPL Season #MIvsDC #SuryakumarYadav pic.twitter.com/tRpJvVQK3u pic.twitter.com/nN8syWW9da
— Kashif (@cricstate) May 22, 2025