KGF hero Yash : ఒకే ఒక్క సినిమాతో తిరుగులేని పాన్ ఇండియన్ సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న హీరోలు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి హీరోలలో ఒకడు రాకింగ్ స్టార్ యాష్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF సిరీస్ తో ఈయన పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది.
రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రాన్ని కూడా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా క్రాస్ చేసింది అంటే, ఎంత పెద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం తర్వాత యాష్ మరో సినిమా షూటింగ్ లో పాల్గొనలేదు. తన భార్య బిడ్డ తో ఛిల్ల్ మూడ్ లో ఉన్నాడు. అయితే ఈయన రీసెంట్ గా కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు ఈ ఫోటో ని సోషల్ మీడియా లో తెగ షేర్ చేస్తున్నారు.
లేటెస్ట్ గా మార్కెట్ లోకి వచ్చిన ఈ కారు ధర అక్షరాలా నాలుగు కోట్ల రూపాయలట.ఈ డబ్బులతో నిర్మాతలు ‘కాంతారా’ రేంజ్ చిన్న బడ్జెట్ సినిమాని తీసేయొచ్చు. అంత రేట్ పెట్టి కోనెంతలా ఇందులో ఏముందో ఒకసారి చూద్దాం.ఈ కారులో 13.7 అంచుల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటుగా 13.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ దిస్ ప్లే కూడా కలిగి ఉంటుందట. వెనుక సీట్ లో కూర్చున్న వారు ఇందులో ఎంటర్టైన్మెంట్ పాటలు మరియు సినిమాలను చూస్తూ ఫుల్లుగా ఎంజాయ్. ఇది ముందు మరియు వెనుక సీట్స్ కి కూడా అమర్చిబడిఉంటుందట.
అలా ఈ కారుని చూసిన అభిమానులు సోషల్ మీడియా లో తమ అభిమాన హీరో ని ట్యాగ్ చేస్తూ కార్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా యాష్ అల్లు అరవింద్ నిర్మించబోయే రామాయణంలో రావణాసురిడి పాత్ర పోషిస్తున్నట్టుగా గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి, కానీ యాష్ ఇందులో నటించడానికి ఒప్పుకోలేదట. అభిమానుల రిక్వెస్ట్ మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.