Raj Tarun: రాజ్ తరుణ్ మరియు లావణ్య వ్యవహారం లో మరో కీలక ట్విస్ట్ ఇప్పుడు సంచలనం గా మారింది. రాజ్ తరుణ్ లావణ్య తో బ్రేకప్ చేసుకొని చాలా రోజులైందని, లావణ్య మస్తాన్ బాషా అని వ్యక్తితో ప్రేమాయణం నడిపినట్టు ఆధారాలతో సహా సోషల్ మీడియా లో ఆడియో రికార్డింగ్స్ ఉన్న ఈ నేపథ్యంలో నేడు రాజ్ తరుణ్ మరియు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కలిసి ముంబై లోని ఒక ప్రైవేట్ హోటల్ లో గడుపుతున్న వీడియోని లావణ్య నేడు మీడియా కి విడుదల చేసి సంచలనం సృష్టించింది. ఒక ప్రైవేట్ హోటల్ రూమ్ లో వీళ్లిద్దరు కలిసి ఉంటున్నారనే విషయాన్ని తెలుసుకున్న లావణ్య నేరుగా ఆ రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఆమెని చూసిన మాల్వీ మల్హోత్రా ఒక్కసారిగా షాక్ కి గురైంది, రాజ్ తరుణ్ కూడా కాస్త టెన్షన్ కి గురయ్యాడు. ఆ తర్వాత లావణ్య మాల్వీ ని అడ్డమైన బూతులు తిడుతూ నా రాజ్ ని వదిలేయ్, మాది 12 ఏళ్ళ రిలేషన్ షిప్ అంటూ మాల్వీ మల్హోత్రా ని కొట్టే ప్రయత్నం చేసింది.
ఈ వీడియో లో రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు. ఆయన లావణ్య పై ఫైర్ అవుతున్న విషయాన్ని గమనించిన మాల్వీ అతనిని లోపలకు పంపించి ఆ సంఘటన మొత్తాన్ని తాను మాత్రమే డీల్ చేస్తాను అన్నట్టుగా ఒంటరిగానే పోరాడింది మాల్వి మల్హోత్రా. ఇక్కడ రాజ్ తరుణ్ మాల్వీ తో సహా జీవనం చేయడం లో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే లావణ్య తో బ్రేకప్ జరిగిన తర్వాత ఆయన తన దారిని తాను ఎంచుకున్నాడు. లావణ్య మస్తాన్ బాషా తో ఎలా అయితే ప్రేమాయణం నడిపిందో, రాజ్ తరుణ్ కూడా తనకి ఇష్టమైన వ్యక్తితో సహజీవనం చేసి పెళ్లాడాలని అనుకున్నాడు. అయితే ఇక్కడ రాజ్ తరుణ్ చేసిన పొరపాటు ఏదైనా ఉందా అంటే, మాల్వీ మల్హోత్రా కి తనకు ఎలాంటి సంబంధం లేదని, మేము కేవలం స్నేహితులు మాత్రమే అని చెప్పడమే. ముందుగానే ఆయన ‘నిజమే..మేము ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నాము’ అని చెప్పి ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు. ఇప్పుడు రాజ్ తరుణ్ అబద్దం చెప్పినట్టు అయ్యింది.
లావణ్య కి ఒక అవకాశం కల్పించిన వాడు అయ్యాడు రాజ్ తరుణ్. సమయానికి రాజ్ తరుణ్ తరుపున పోరాడే శేఖర్ బాషా కూడా ఇప్పుడు బయట లేదు, బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు. శేఖర్ బాషా బయట ఉండుంటే లావణ్య కి ఇంత గొంతు ఉండేది కాదు, అతను అడిగిన అనేక ప్రశ్నలకు లావణ్య సమాధానం చెప్పుల్ని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఆమె స్టూడియో వదిలి ఒకసారి పారిపోయే పరిస్థితి కూడా నెలకొంది. అదుపు తప్పిన కోపంతో శేఖర్ భాషపై చెప్పులు కూడా విసిరింది లావణ్య. ఇప్పుడు రాజ్ తరుణ్ ఒక్కడే ఈ వ్యహారం లో ఎలా ఒంటరిగా పోరాడబోతున్నాడు అనేది అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం.